Jailer and Bhola shankar : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళాశంకర్' భారీ డిజాస్టర్‌గా నిలిచింది. రీఎంట్రీలో చిరుకు 'ఆచార్య' తర్వాత ఆ రేంజ్లో అతిపెద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఇప్పుడు సోషల్‌మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే మొత్తం ట్రోల్స్ కనపడుతున్నాయి. నెటిజన్లు, మెగా అభిమానులు, సినీ ప్రియులు.. ఈ మూవీలో సన్నివేశాలను మీమ్స్‌లో క్రియేట్ చేస్తూ ఓ రేంజ్లో ఆటాడేసుకుంటున్నారు.
సినిమాలో జబర్దస్త్ కామెడీ, పవన్ మేనరిజం, శ్రీముఖి చేసిన ఖుషి నడుము సీన్ అన్నీ బోల్తా కొట్టాయని అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా సినిమాకు మహతి స్వర సాగర్ అందించిన మ్యూజిక్, మూవీలో చిరు చేసిన రొమాన్స్, వేసిన డ్యాన్స్ స్టెప్పులు చూస్తుంటే.. 1990ల కాలంలో ఈ సినిమా వచ్చి ఉంటే హిట్‌గా నిలిచేదని కామెంట్స్ చేస్తున్నారు. 20ఏళ్ల కింద తీయాల్సిన సినిమాను ఇప్పుడు చేశారని విమర్శిస్తున్నారు.
చిరు రేంజ్ స్థాయిలో క్రేజ్ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్ లాంటి బడా హీరోలు తమ వయసుకు తగ్గట్టు కథలను ఎంచుకుంటూ చేస్తుంటే.. మెగాస్టార్ మాత్రం ఇంకా పాత డ్యాన్స్, హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారని అంటున్నారు. చిరు ఆ పాత డ్యాన్స్, రొమాన్స్ చేయడం వంటి ఆపేయాలని, ఒకవేళ డ్యాన్స్ మాత్రం వేయాలనుకుంటే.. కొత్త డ్యాన్స్ కొరియోగ్రాఫర్లను నియమించుకుని చిందులేయాలని అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ చిత్రాన్ని ఒరిజనల్ వెర్షన్ వేదాళంతో పోలుస్తూ..ఆ చిత్రంలో కూడా చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ ఏమీ లేకపోయినా.. అనిరూధ్ మ్యూజిక్-అజిత్ నటనతో హిట్‌గా నిలిచిందని.. కానీ భోళాశంకర్‌లో అవి కూడా లేవని అంటున్నారు. అసలీ చిత్రం రీమేక్ చేయాల్సిన అంత అవసరం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు.
Jailer Theatres : భోళాశంకర్ ప్లేస్‌లో జైలర్... ఈ భోళాశంకర్‌కు పోటీగా రిలీజైన రజనీకాంత్ జైలర్ హిట్ టాక్‌ను అందుకుంది. దీంతో భోళాశంకర్ ప్రదర్శిస్తున్న థియేటర్లలో రజనీ జైలర్‌ను ప్రదర్శించేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. ఇప్పటికే జైలర్ రెండు రోజుల్లో రూ.70కోట్ల కలెక్షన్స్‌కు చేరువైంది. ఈ వీకెండ్లో మరింత వసూళ్లను పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Bhola Shankar Day 1 Collection : చిరు 'భోళాశంకర్'..తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే ?
Jailer Box Office Collection : రూ.70 కోట్లకు చేరువలో 'జైలర్'.. ఇక వీకెండ్స్‌లోనూ తగ్గేదే లే..