Roja Jabardasth: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవి దక్కించుకున్నారు నటి ఆర్కే రోజా. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే టీవీ, సినిమా షూటింగ్లలో ఇక పాల్గొననని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ టీం సభ్యులు రోజాకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆమె పాల్గొన్న చివరి ఎపిసోడ్లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రోజా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రెండుసార్లు ఎమ్మెల్యే అయినప్పుడు జబర్దస్లోనే ఉన్నానని, ఇక్కడ ఉన్నప్పుడే మంత్రి కావాలని కోరుకున్నానని, తాను అనుకున్నట్లే జరిగింది కాబట్టే ఇక్కడికి వచ్చానని చెప్పారు. జబర్దస్త్‌కు దూరం కావటం వల్ల అందరినీ మిస్సవుతానని కన్నీటి పర్యంతమయ్యారు. తనకు సేవ చేయటం ఎంతో ఇష్టమని, అందుకే జబర్దస్త్ వంటి ఇష్టమైన వాటిని వదులుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈటీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రోజా. తన జీవితంలో అనుకున్న గమ్యాన్ని చేరుకునేలా చేశారని పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతంటే స్టేజ్‌పై ఉన్న జబర్దస్త్ ఆర్టిస్టులు, మిగిలిన వారు కూడా కంటతడి పెట్టుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తెలుగు తెరపై హీరోయిన్గా ఓ వెలుగువెలిగిన రోజా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలక పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నారు. 2004లో రాజకీయాల్లోకి వచ్చినా.. మరోవైపు సినిమాలు చేస్తూ వచ్చారు. మొదట టీడీపీ అభ్యర్థిగా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ టికెట్‌పై నగరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలి విడతలోనే ఆమెకు మంత్రి పదవి వస్తుందని భావించినా.. అది జరగలేదు. రెండో విడతలో రోజాను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
ఇదీ చూడండి: 'కేజీఎఫ్-2' హిట్ టాక్- బాలీవుడ్‌పై ఆర్జీవీ హాట్ కామెంట్స్