Interesting Facts About Chandra Mohan Wife: చంద్రమోహన్.. అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఈతరానికి తెలుసు. మరికాస్త వెనక్కి వెళ్తే.. ఆయన ఒకప్పుడు అందాల హీరో అని కూడా తెలుస్తుంది. కానీ.. ఆయన భార్య గురించి మాత్రం చాలా మందికి తెలియదు. అసలు ఆమె ఫొటోలు చూసిన వారు కూడా అరుదుగానే ఉంటారు! కారణం ఏమంటే.. ఆమె ఎప్పుడూ బయట కనిపించలేదు. పిల్లల వివరాలు కూడా అంతే. మరి.. వారిప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలు తెలుసుకుందాం.
చంద్రమోహన్ - 1000 సినిమాలు చేసి, 100 కోట్లు పోగొట్టుకొని, స్థిరంగా నిలబడి!
Chandra Mohan Wife Jalandhara News: చంద్రమోహన్ భార్య పేరు జలంధర. ఆమె సాధారణ గృహిణి కాదు. ప్రముఖ రచయిత్రి. MA చదువుతున్నప్పుడు.. చంద్రమోహన్‌తో వివాహం అయ్యింది. పెళ్లి తర్వాత కూడా భార్యాభర్తలు ఇద్దరూ.. తమతమ రంగాల్లో ఒకరికి ఒకరు అండగా నిలిచారు. ప్రోత్సహించుకున్నారు. జలంధర దాదాపు 100కు పైగా కథలు, నవలలు రాశారు. పలు సాహితీ పురస్కారాలు కూడా అందుకున్నారు. చంద్రమెహన్, జలంధర ఆదర్శ దంపతులుగా జీవిత సాఫల్య పురస్కారం సైతం అందుకున్నారు. కానీ.. మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు అరుదు.
సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భర్త చంద్రమోహన్ గురించి చెప్పారు. ఆయన నటించిన అన్ని చిత్రాలూ తనకు నచ్చుతాయని అన్నారు. ఒకప్పుడు ఆయనతో నటించడానికి ఎంతో మంది హీరోయిన్లు ఉత్సాహం చూపించేవారనీ.. ఆయన లక్కీ హీరో అని ఇండస్ట్రీలో టాక్ ఉందని అన్నారు. ఆయన హస్తవాసి తనకు కూడా కలిసి వచ్చిందని చెప్పారు. ఆయన చేత్తో తనకు డబ్బు ఇవ్వడం వల్లనే.. తనకు మంచి స్టార్ రైటర్‌గా పేరు వచ్చిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. చంద్రమోహన్ చేత్తో ఒక్క రూపాయి తీసుకుంటే ఎంతో కలిసి వస్తుందని చాలా మంది భావిస్తారని.. అందుకే.. ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీన చాలా మంది ఇంటికి వచ్చి.. ఆయన చేతుల మీదుగా డబ్బు తీసుకుంటారు జలంధర తెలిపారు.
Chandra Mohan Wife Jalandhara Details in Telugu: చంద్రమోహన్ సైతం.. భార్యపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు. పని ఒత్తిడిలో తాను కోపగించుకున్నా.. ఆమె ఓపిగ్గా భరించేదని, ఎంతో సహనం ఉందని అన్నారు. తన కోపాన్ని తగ్గించడానికే.. దేవుడు ఆమెకు అంత సహనం ఇచ్చాడేమో అని అనిపిస్తూ ఉందంటూ.. భార్య గొప్పదనాన్ని చాటారు.
ఇక వారసత్వం గురించి చూస్తే.. చంద్రమోహన్‌కు అబ్బాయిలు లేరు. ఇద్దరు పిల్లలు అమ్మాయిలే. ఈ కారణంగానే.. చంద్రమోహన్ వారసత్వం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేకపోయింది. అమ్మాయిలిద్దరికీ వివాహాలు అయిపోయాయి. పెద్దమ్మాయి మధుర మీనాక్షి ఒక సైకాలజిస్టు. ఆమె భర్త బ్రహ్మ అశోక్ ఫార్మసిస్టు. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమె భర్త నంబి కూడా డాక్టరే. వీరిద్దరూ చెన్నైలోనే ఉంటున్నారు.
'వైవిధ్య నటనతో చెరగని ముద్ర'- చంద్రమోహన్ మృతిపై చిరంజీవి సంతాపం
కొత్త హీరోయిన్ల లక్కీ స్టార్ - ప్రతి పాత్ర చేయడానికి అదే కారణం!