Indias Most Successful Actor : చాలా ఏళ్లుగా చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోలు తమ నటనతో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అప్పటి ఎన్టీఆర్, దిలీప్ కుమార్ నుంచి ఇప్పటి రజనీకాంత్, చిరంజీవి ప్రస్తుత షారూఖ్ ఖాన్ వరకు..చాలా మంది స్టార్స్ తమ కృషితో అంచెలంచలుగా ఎదిగి స్టార్డం సంపాదించుకున్నారు. వీరందరూ తమ సినిమాల ద్వారా బాక్సాఫీసు వద్ద పలు రికార్డులు సృష్టించారు. కానీ.. భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత విజయవంతమైన నటుల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ నటుడిగా ఓ స్టార్ హీరో పేరు పాపులరైంది. ఇంతకీ ఆయనెవరో కాదు.. ఇటీవలే 'ఓ మై గాడ్ 2' సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్టార్ హీరో అక్షయ్ కుమార్.
Akshay Kumar Movies : సుమారు 32 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న అక్షయ్.. తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన నటించిన పలు సినిమాలు థియేటర్లలో సందడి చేసి.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇక 2023 నాటికి ఆయన సినిమాలు ఇండియాలో రూ. 4834 కోట్లు వసూలు సాధించాయి. అయితే ఇప్పటి వరకు ఆయన నటించిన పలు చిత్రాలు భారీ హిట్లు కాకపోయినప్పటికీ.. 126 చిత్రాలకు సుమారు 250 మిలియన్ల వసూళ్లు అందుకున్నాయి. అలా ఈ స్టార్ హీరోకు తన సినిమాల వల్ల ప్రపంచవ్యాప్తంగా రూ. 8000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చింది.
ఈ విషయంలో అక్షయ్.. రజనీకాంత్, కమల్ హాసన్, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్లను అక్షయ్ వెనక్కి నెట్టారు. వీరందరూ తమ సినిమాలతో చాలా సార్లు రూ.400 కోట్ల మార్కును దాటారు. అయినప్పటికీ అక్షయ్ మార్క్‌ను దాటలేకపోయారు.
ఇక భారతీయ చిత్రాలు బాక్సాఫీసు వద్ద రూ.100 కోట్ల మార్క్ మొదలై దాదాపు 15 ఏళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్షయ్ కుమార్ సుమారు 52 చిత్రాల్లో నటించారు. అదే సమయంలో, షారుఖ్ 15, సల్మాన్ 25 సినిమాల్లో నటించగా.. ఆమిర్ మాత్రం తొమ్మిది సినిమాలు చేశారు. మరోవైపు సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే 2008 తర్వాత 10 చిత్రాల్లోనే నటించారు.
అయితే ఇతర హీరోల కంటే అక్షయ్ కుమార్ ఎక్కువ సినిమాలు చేయడం వల్ల బాక్సాఫీస్ వద్ద పలు హిట్ సినిమాలను తన ఖాతాలోకి వేసుకున్నారు. అందులో '2.0', 'సూర్యవంశీ', 'మిషన్ మంగళ్', 'ఎయిర్‌లిఫ్ట్' లాంటి సినిమాలు ఉన్నాయి.
ఇతరుల సంగతేంటి ?
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన 65 సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ.7000 కోట్లకు పైగా వసూలు సాధించాయి. మరికొద్ది రోజుల్లో 'జవాన్', 'డుంకీ' విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇవి గనక హిట్టయితే.. షారుక్.. అక్షయన్ని అధిగమించే అవకాశముంది.
ఇక ఈ జాబితాలో సల్మాన్ ఖాన్ రూ. 7000 కోట్ల గ్రాస్‌తో మూడో స్థానంలో ఉన్నారు. 'దంగల్', 'పీకే' లాంటి సూపర్‌హిట్ సినిమాల్లో నటించిన ఆమిర్.. నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్, రజనీకాంత్, కమల్ హాసన్‌లు రూ. 5 వేల కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉండగా.. ప్రభాస్, హృతిక్ రోషన్, దళపతి విజయ్ ఒక్కొక్కరు రూ. 4000 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లతో ఉన్నారు.
భారత్‌లో హయ్యెస్ట్ టాక్స్ పేయర్ ఎవరు?.. తెలిస్తే షాక్ అవుతారు!