ETV Bharat / entertainment

100 ఆడిషన్స్​కు వెళ్లా.. అందరూ రిజెక్ట్‌ చేశారు.. కానీ ఇప్పుడు ఫుల్​ హ్యాపీ: దివి - గాడ్​ఫాదర్ మూవీ సునీల్​ భార్య

సుమారు వందకు పైగా ఆడిషన్స్‌లో తాను పాల్గొన్నానని, ఎంతోమంది నన్ను రిజెక్ట్‌ చేశారని బిగ్​బాస్​ ఫేమ్​ దివి తెలిపారు. ఇటీవలే విడుదలైన చిరంజీవి 'గాడ్​ఫాదర్'​లో నటించడం చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. ఆమె పంచుకున్న మరిన్ని విశేషాలు మీకోసం..

divi godfather
divi godfather
author img

By

Published : Oct 10, 2022, 8:02 AM IST

Divi Godfather : మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో ఓ చిన్న పాత్ర అయినా చేయాలనే ఆశ నటీనటులకు ఉంటుందని, కెరీర్‌ ఆరంభంలోనే ఆ కల నెరవేరినందుకు సంతోషంగా ఉన్నానని నటి దివి అన్నారు. 'గాడ్‌ఫాదర్‌'లో సునీల్‌ సతీమణిగా ముఖ్య భూమిక పోషించిన దివి.. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

"బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో నేను అందరికీ పరిచయమయ్యాను. ఆ షోలో అడుగుపెట్టడానికంటే ముందు సుమారు వందకు పైగా ఆడిషన్స్‌లో పాల్గొన్నాను. ఎంతోమంది నన్ను రిజెక్ట్‌ చేశారు. వాటివల్ల నేను మరింత ధైర్యంగా మారి.. ఆ రియాల్టీషోలోకి అడుగుపెట్టా. ఆ షో తర్వాత నా లైఫ్‌ ఎంతో మారింది. ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నా. అక్కడ ఉన్నప్పుడే.. తన సినిమాలో నాకు అవకాశం ఇస్తానని మెగాస్టార్‌ మాటిచ్చారు. దాని ప్రకారమే 'గాడ్‌ఫాదర్‌'లో నటించే ఛాన్స్ వచ్చింది. చిరు సినిమాలో నటించడం అద్భుతంగా అనిపించింది.

అందులో నా రోల్‌ చూసి ప్రేక్షకులు నన్ను తిట్టుకుంటున్నారు. వాళ్లు అంతలా తిట్టుకుంటున్నారంటే, నా పాత్రకు నేను న్యాయం చేశాననే అనుకుంటున్నా. అందుకు ఆనందంగా ఉంది. ఇక, చిరంజీవి గొప్ప వ్యక్తి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా తన సహనటులందర్నీ ఆయన ఒకేలా చూస్తారు. అందరి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. చిరుతో ఫొటో దిగాలని ఊటీ షెడ్యూల్‌కు నాతోపాటు మా అమ్మానాన్న వచ్చారు. వాళ్లు రోజూ సెట్‌కు వచ్చేవాళ్లు. ఇదే విషయాన్ని నేను ఆయనతో చెప్పాను. ఆ తర్వాత ఓసారి అమ్మానాన్న సెట్‌లో ఉండటాన్ని గమనించిన ఆయన వెంటనే కారు దిగి వచ్చి.. వాళ్లతో ఓ ఫొటో దిగారు. ఆరోజును ఎప్పటికీ మర్చిపోలేను" అని దివి వెల్లడించారు.

ఇవీ చదవండి: పండగ జోరు.. చూపించేదెవరు?.. అందరి దృష్టి సంక్రాంతిపైనే!

రాజమండ్రిలో శంకర్-రామ్​చరణ్​ సినిమా షూటింగ్.. మోహన్‌లాల్‌ 'మాన్‌స్టర్‌' ట్రైలర్‌...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.