ETV Bharat / entertainment

అభిమాని చేసిన ఆ పనికి హృతిక్​ రోషన్​ ఫుల్​ సీరియస్! - హృతిక్​ రోషన్​ అభిమానిపై సీరియస్​

తమ అభిమాన హీరోలు కనపడగానే ఫ్యాన్స్​కు ఎక్కడాలేని ఆనందం వచ్చి రకరకాల పనులు చేస్తుంటారు. అయితే తాజాగా ఓ అభిమాని చేసిన పనికి హీరో హృతిక్​ రోషన్​ చాలా సీరియస్​ అయ్యారు. అసలు ఏం జరిగిందంటే?

hrithik roshan serious on fans
hrithik roshan serious on fans
author img

By

Published : Sep 10, 2022, 3:32 PM IST

Hrithik Roshan Serious On Fan : అభిమాన హీరోలు కనిపిస్తే చాలు.. అడ్డుగా ఉన్న సెక్యూరిటీని కూడా దాటుకుని వారితో సెల్ఫీలు తీసుకోవాలని ఆశపడుతుంటారు చాలా మంది అభిమానులు. కొన్నిసార్లు ఈ అత్యుత్సాహం వల్ల వారికే ప్రమాదం జరిగే అవకాశముంది. సదరు హీరోలకు కూడా దీని వల్ల అసౌకర్యం కలగవచ్చు. ఫలితంగా కొంతమంది ఓర్పు నశించి అభిమానులపై ఆగ్రహం వెళ్లగక్కిన, కొన్నిసార్లు ఫ్యాన్స్‌పై చేయి చేసుకున్న దాఖలాలు కూడా లేకపోలేదు. తాజాగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

శుక్రవారం హృతిక్ తన పిల్లలతో 'బ్రహ్మాస్త్ర' సినిమా చూడడానికి ముంబయిలోని ఓ మల్టీప్లెక్స్‌కు వెళ్లారు. అయితే సినిమా చూసి తిరిగి కారు వద్దకు వెళ్లే సమయంలో అకస్మాత్తుగా ఓ అభిమాని హృతిక్‌తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆవేశంగా అందర్నీ తోసుకుని రావడం వల్ల అసౌకర్యంగా ఫీలైన హీరో.. అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా అతడిని తిట్టేంత వరకు వెళ్లారు. ఈలోపు సెక్యూరిటీ సిబ్బంది అభిమానిని హృతిక్‌కు దూరంగా లాక్కెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అభిమానిపై హృతిక్​ రోషన్​ సీరియస్​

ఇవీ చదవండి: 'సీతా నీ కన్నీరు కనిపిస్తోంది.. పిలుపు వినిపిస్తోంది'.. సీతారామంపై మనసు పారేసుకుంటున్న నెటిజన్లు!

'ఆర్​ఆర్​ఆర్' రికార్డు​ బద్దలు కొట్టిన 'బ్రహ్మాస్త్ర'.. తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.