ETV Bharat / entertainment

హోంబలే ఫిల్మ్స్​ సెన్షేషనల్​ అనౌన్స్​మెంట్​.. రూ.3 వేల కోట్ల బడ్జెట్​తో

కేజీయఫ్​ 2, కాంతార నిర్మాణ సంస్థ ఓ సెన్షేషనల్​ ప్రకటన చేసింది. రాబోయే 5 ఏళ్లలో సినిమా రంగంలో రూ.3000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించింది.

Homable films announces Three thousand crore projects
హోంబలే ఫిల్మ్స్​ సెన్షేషనల్​ అనౌన్స్​మెంట్​.. రూ.3 వేల కోట్ల బడ్జెట్​తో..
author img

By

Published : Jan 2, 2023, 9:34 PM IST

కేజీయఫ్​ 2, కాంతారతో ఈ ఏడాది దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్​.. ఓ సెన్సేషనల్​ అనౌన్స్​మెంట్​ చేసింది. రాబోయే 5 ఏళ్లలో సినిమా రంగంలో రూ.3000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించింది. న్యూ ఇయర్ సందర్భంగా ఓ సుదీర్ఘ లేఖ రాసి పోస్ట్​ చేశారు నిర్మాత విజయ్​ కిరంగదూర్​. ఇందులోనే ఈ విషయాన్ని చెప్పారు. ప్రజల సహకారంతో మరిన్ని మైలురాళ్లు సాధిస్తామని.. తమపై ప్రజలు చూపిస్తున్న ఆప్యాయత, ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. తమ సినిమాలను ఆదరిస్తూ తమపై మరింత భాద్యతను పెంచారని పేర్కొన్నారు.

ఈ దేశంలో ప్రతిభకు కొదవ లేదని.. ఆ ట్యాలెంట్‌ను ప్రోత్సహించేందుకుఎంటర్‌టైన్‌మెంట్ సెక్టర్‌లో ఈ భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు విజయ్ తెలిపారు. అంతకుముందు రీసెంట్​ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "ఏటా కనీసం ఐదారు చిత్రాలు మా బ్యానర్‌ కింద నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో ఒక హిట్‌ సినిమాకు సీక్వెల్‌ ఉండబోతోంది. ఇక 'సలార్‌' పూర్తయ్యాక 'కేజీయఫ్‌-3'పై నీల్‌ దృష్టి పెట్టనున్నారని విజయ్‌ చెప్పారు. సలార్‌ పూర్తయ్యక.. కేజీయఫ్‌-3 స్క్రిప్ట్‌ పనులు మొదలు పెట్టనున్నారని తెలిపారు. నీల్‌ వద్ద ఇప్పటికే స్టోరీ లైన్‌ ఉందని, వచ్చే ఏడాది గానీ, ఆ మరుసటి ఏడాదిగానీ సాకారం కావొచ్చని చెప్పారు.

ఇదీ చూడండి: ఆ నటుడితో తమన్నా రొమాన్స్​.. కిస్సింగ్ వీడియో వైరల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.