RRR: జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఎన్టీఆర్, చరణ్ ఈ సినిమాలో తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. అయితే ఈ సినిమాలో ఎవరి పాత్ర బాగుంది? ఎవరికి ఎక్కువ ప్రశంసలు దక్కుతున్నాయనే దానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సెకండాఫ్‌లో తారక్‌ను చరణ్ డామినేట్ చేశాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే విషయాన్ని ముంబయిలో జరిగిన సినిమా సక్సెస్‌మీట్‌లో బాలీవుడ్ మీడియా లేవనెత్తడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చరణ్, ఎన్టీఆర్ ఒకే వేదికపై ఉండగా ఓ రిపోర్టర్ ఈ ఇబ్బందికరమైన ప్రశ్న అడిగాడు. 'సినిమాలో రామ్‌చరణ్ బాగా ఎలివేట్ అయ్యారు. ఆయనకే ప్రశంసలు దక్కుతున్నాయి. దీనికి సమాధానం చెప్పండి' అని ప్రశ్నించారు.
ఇద్దరూ స్టార్స్ ఒకే వేదికపై ఉన్నప్పుడు.. ఇలాంటి ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. అయితే రామ్ చరణ్ వెంటనే కలగజేసుకొని సమాధానం ఇచ్చారు. 'ఆ మాటను నేను ఏకీభవించను. ఒక్కక్షణం కూడా నేను దాన్ని నమ్మను. మేమిద్దరం చాలా బాగా నటించాం. ఎన్టీఆర్ అద్భుతంగా చేశాడు. ఇప్పటివరకూ ఏ చిత్రానికి చేయనంత ఎంజాయ్‌మెంట్ ఈ సినిమా చేసేటప్పుడు ఫీలయ్యాను. తారక్‌తో నా ప్రయాణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశాన్ని కల్పించిన రాజమౌళికి థ్యాంక్స్' అని చాలా డిప్లమాటిక్‌గా బదులిచ్చారు చరణ్.
ఇదీ చదవండి: హాట్ ఫొటోలతో టెంపరేచర్ పెంచేసిన అనసూయ.. తట్టుకోవడం కష్టమే!