ETV Bharat / entertainment

హరీశ్​శంకర్​కు చిరు బంపర్​ ఆఫర్​.. ఆ​ జోనర్​లో సినిమా! - harishshankar chiranjeevi

Harishshankar Chiranjeevi movie: సెకండ్​ ఇన్నింగ్స్​లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న మెగాస్టార్​ చిరంజీవి.. తన మనసులోని ఓ మాటను బయటపెట్టారు. 'రౌడీ అల్లుడు', 'దొంగ మొగుడు' తరహాలో చక్కటి సినిమాను దర్శకుడు హరీశ్​శంకర్​తో చేయాలని ఉందని చెప్పారు.

Harishshankar movie with chiranjeevi
హరీశ్​ శంకర్​ చిరంజీవి సినిమా
author img

By

Published : Apr 27, 2022, 2:06 PM IST

Harishshankar Chiranjeevi movie: ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్​కు మెగాస్టార్ చిరంజీవి బంపర్​ ఆఫర్ ఇచ్చారు. 'రౌడీ అల్లుడు', 'దొంగ మొగుడు' తరహాలో తనతో చక్కటి సినిమా చేయాలని చిరంజీవి హరీశ్ శంకర్​ను కోరారు. 'ఆచార్య' చిత్రం ఏప్రిల్ 29న విడుదలను పురస్కరించుకొని హరీశ్ శంకర్... మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాలతో ప్రత్యేక ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా 'ఆచార్య' చిత్ర విశేషాలను వెల్లడిస్తూనే మెగాస్టార్ చిరంజీవి తన మనసులోని మాట బయటపెట్టారు.

పదేళ్లు రాజకీయాల్లో ఉండి ఆ తర్వాత వరుసగా రెండు సీరియస్ కథలతో సినిమా చేయడం వల్ల ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని పంచలేకపోయానని పేర్కొన్న చిరంజీవి.... హరీశ్ శంకర్ లాంటి దర్శకుడు మంచి కథ తయారు చేస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. చిరంజీవి ప్రకటనతో ఉబ్బితబ్బిబ్బైన హరీశ్ శంకర్.... ప్రశ్నించడానికి వస్తే వరమిచ్చారంటూ ఆనందం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్​తో చేస్తున్న 'భవదీయుడు భగత్ సింగ్' పూర్తి కాగానే.. మెగాస్టార్ కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్ తయారుచేస్తానని హరీశ్ శంకర్ వెల్లడించారు.

ఇదీ చూడండి: Acharya First review: మెగాఫ్యాన్స్​కు పూనకాలే.. ఫుల్​ మాస్​ మసాలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.