ETV Bharat / entertainment

'హనుమాన్'​- నెక్ట్స్​ చిరంజీవి, నిఖిల్ కూడా ఇదే బాటలో! - హనుమాన్ చిత్రం

Hanuman Movie : ప్రస్తుతం హనుమాన్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్​తో దూసుకుపోతోంది. దీంతో ఇప్పుడు టాలీవుడ్​లో హనుమాన్ ఫుల్​​ ట్రెండ్ అవుతోంది. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, హీరో నిఖిల్​ కూడా హనుమాన్ బాటలోనే రాబోతున్నారని తెలుస్తోంది!

టాలీవుడ్‌ 'హనుమాన్'​ - చిరంజీవి, నిఖిల్ కూడా ఇదే బాటలో!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 5:10 PM IST

Hanuman Movie : ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు ఇండియావైడ్​గా ఫిల్మ్​ ఇండస్ట్రీలో హనుమాన్​ ట్రెండ్ కనిపిస్తోంది. తమ వెంట హనుమంతుడు ఉంటే సినిమా పక్కా హిట్ ​ అన్న నమ్మకం బలంగా కనిపిస్తోంది. ఎందుకంటే రీసెంట్​గా తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన 'హనుమాన్' చిత్రం థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను అందుకుంటూ పోతోంది. ఇందులో హీరో తేజ సజ్జా హనుమంతుడి భక్తుడిగా, అసాధారణ శక్తులు ఉన్న వ్యక్తిగా కనిపించి తన నటనతో ఆకట్టుకున్నారు.

అయితే ఇప్పుడు తెలుగులో షూటింగ్ జరుపుకుంటున్న మరో రెండు తెలుగు సినిమాల్లో కూడా హనుమంతుడి పాత్ర కనపడబోతుంది. హీరోలు హనుమంతుడి భక్తులుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు సీనియర్ హీరో మెగాస్టార్​ చిరంజీవి కాగా మరొకరు యంగ్ హీరో నిఖిల్. తాజాగా నిఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్​ స్వయంభుపై(Nikhil Swayambhu Movie) ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు.

'కార్తికేయ 2'తో పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేసుకున్న నిఖిల్​ తన తరువాతి సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే ప్లాన్ చేసుకున్నారు. అందులో ఒకటి 'స్వయంభు'. " స్వయంభు కోసం నాన్ స్టాప్‌గా షూటింగ్ చేస్తున్నాం. ఈ సినిమాలో నేను కూడా హనుమంతుడి భక్తుడినే. అద్భుతమైన సీక్వెన్స్‌లను షూట్ చేస్తున్నాం. ఈ దసరా, దీపావళికి థియేటర్లలో కలుద్దాం" అంటూ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు నిఖిల్​.

Chiranjeevi Vasishta Movie : ఇక చిరంజీవి- బింబిసార దర్శకుడు వశిష్ట కాంబోలో రానున్న 'విశ్వంభర' టైటిల్ కాన్సెప్ట్​ కూడా రీసెంట్​గా విడుదలైంది. ఇందులో కూడా హనుమంతుడిని ప్రత్యేకంగా చూపించారు. దీంతో నెటిజన్లు చిరు, తేజ సజ్జాతో పాటు నిఖిల్​ కూడా ప్రస్తుతం హనుమంతుడి ట్రెండ్​లో భాగమయ్యారని అంటున్నారు. కాగా, చిరు మొదటి నుంచి హనుమంతుడి భక్తుడన్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన పలు సినిమాల్లో హనుమంతుడిని రిఫరెన్స్​ కూడా కనపడుతుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'గుంటూరు కారం' రూ.100 కోట్లు - మహేశ్ ఖాతాలోకి ఏ హీరోకు సాధ్యం కానీ రికార్డ్​!

'హనుమాన్​ 2'పై అంచనాలు పెంచేసిన బాలయ్య! - ఈ వీడియో చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.