ETV Bharat / entertainment

Gunturu Karam Shooting : మహేశ్​ తిరిగొచ్చేస్తున్నాడహో.. ఆ రోజు నుంచే షూటింగ్ షురూ.. - దుబాయ్​ నుంచి మహేశ్​ రిటర్న్​

guntur karam shooting : సూపర్ స్టార్ మహేశ్​ బాబు 'గుంటూరు కారం' సినిమా మళ్లీ షూటింగ్ ప్రారంభించుకోనుంది. మహేశ్ దుబాయ్​ నుంచి తిరిగివచ్చేస్తున్నారని తెలిసింది. ఆ రోజు నుంచి చిత్రీకరణ ప్రారంభంకానుందని సమాచారం అందింది. ఆ వివరాలు..

Gunturu Karam షూటింగ్ అప్డేట్​
Gunturu Karam షూటింగ్ అప్డేట్​
author img

By

Published : Aug 2, 2023, 5:51 PM IST

Updated : Aug 2, 2023, 6:09 PM IST

guntur karam shooting : సూపర్ స్టార్ మహేశ్​ బాబు తిరిగొచ్చేస్తున్నాడహో.. మళ్లీ 'గుంటూరు కారం' షూటింగ్​ షురూ కాబోతుంది. దీంతో మహేశ్ అభిమానుల్లో సందడి మొదలైంది. అలాగే ఈ నెలలో ఆయన పుట్టినరోజుకు ఓ సాలిడ్ అప్డేట్​ కూడా ఇవ్వనున్నట్లు తెలిసింది. ఫస్ట్ సాంగ్​ను రిలీజే చేసే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది.

'గుంటూరు కారం' సినిమా మొదటి నుంచి ఎన్నో సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. రీసెంట్​గా కూడా చిత్రీకరణ ఆగిపోయింది. దీంతో మహేశ్​ బాబు తన ఫ్యామీలితో కలిసి ఫారెన్​ టూర్​కు వెళ్లిపోయారు. అయితే మళ్లీ ఎట్టకేలకు షూటింగ్ ప్రారంభంకానుందని తెలిసింది. మహేశ్​ బాబు ఈ నెల 16న మహేశ్​ ఇండియాకు తిరిగి రానున్నారని సమాచారం అందింది. 20వ తేదీ నుంచి మళ్లీ సెట్స్​లోకి అడుగుపెడతారని, ఇక కంటిన్యూస్​గా షూటింగ్​ అవుతుందని తెలిసింది.

guntur karam movie updates : ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ కూడా పక్కకు తప్పుకున్నారని కథనాలు వచ్చాయి. రవి కె చంద్రన్ ఆ బాధ్యతలు తీసుకుంటారని అంతా అన్నారు. అయితే త్వరలో కొత్త సినిమాటోగ్రాఫర్​ను ఫైనలైజ్​ చేస్తారని ప్రయత్నాలు చేస్తున్నారట. 11 లేదా 12 నుంచి హీరో లేకుండానే కొన్ని ఎపిసోడ్​లను చిత్రీకరించాలని సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇకపోతే చాలా కాలంగా అప్డేట్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే వారికి అదిరిపోయే సర్​ప్రైజ్ ఇచ్చేందుకు మూవీటీమ్​ రెడీ అవుతోందట. ఈ నెలలో రానున్న మహేశ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని మొదటి పాటను రిలీజ్​ చేసేందుకు ప్లాన్ చేస్తోందట.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. యంగ్ సెన్సేషనల్​ బ్యూటీ శ్రీలీల, 'ఇచ్చట వాహనములు నిలుపరాదు', 'హిట్‌ 2', 'ఖిలాడి' ఫేమ్​ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్​, ఫస్ట్ లుక్ పోస్టర్స్ అభిమానుల్ని ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి :

మహేశ్​ 'గుంటూరు కారం'లో పొలిటికల్ టచ్​!.. కొత్త పోస్టర్​ చూశారా?

మహేశ్​ టు పవన్​.. ఆ విషయంలో ప్రభాస్​ ఒక్కడే పర్​ఫెక్ట్​

Last Updated : Aug 2, 2023, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.