ETV Bharat / entertainment

ఘాటెక్కనున్న 'గుంటూరు కారం' - టికెట్ ధర పెంపునకు గ్రీన్ సిగ్నల్ - మల్టీప్లెక్స్​లో ఎంతంటే ?

Guntur Kaaram Ticket Prize : మరి కొద్ది రోజుల్లో 'గుంటారు కారం' మూవీ థియేటర్లలో సందడి చేయనున్న తరుణంలో ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అంతే కాకుండా మరికొన్ని వెసులుబాటులు కల్పించింది. అదేంటంటే ?

Guntur Kaaram Ticket Prize
Guntur Kaaram Ticket Prize
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 3:46 PM IST

Updated : Jan 9, 2024, 5:09 PM IST

Guntur Kaaram Ticket Prize : మాటల మాంత్రికులు త్రివిక్రమ్ శ్రీనివాస్​ - టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్​లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. ఇప్పటికే ట్రైలర్​, టీజర్​తో ఆకట్టుకున్న ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విడుదల పనుల్లో మూవీ టీమ్ బిజీగా ఉంది. అయితే తాజాగా 'గుంటూరు కారం' మూవీ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సింగిల్ స్క్రీన్స్​లో రూ. 65, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.100 రూపాయలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించినట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక నైజాంలో ఆ చిత్రాన్ని విడుదల చేస్తున్న శ్రీవెంకటేశ్వర ఫిల్మ్స్ సంస్థ టికెట్ ధరల పెంపు, బెన్ ఫిట్ షో తోపాటు అదనపు ఆటలకు అనుమతి ఇవ్వాలంటూ ఇటీవలే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తిని క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం ఈ నెల 12 నుంచి 18 వరకు వారం రోజులపాటు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. అలాగే ఉదయం 4 గంటల ఆటతో ఆరో షోను వేసుకోవచ్చు అంటూ సూచించింది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 23 చోట్ల ఈ నెల 12న అర్థరాత్రి 1 గంట నుంచి గుంటూరు కారం బెన్ ఫిట్ షోలను థియేటర్లలో వేసుకునే అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Guntur Kaaram Trailer 24 Hours Record : మరోవైపు 'గుంటూరు కారం' ట్రైలర్ యూట్యూబ్​లో రికార్డులు బద్దలుకొడుతోంది. ఈ పవర్​ప్యాక్డ్​ ఎంటర్​టైన్​మెంట్ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్​లో నెం. 1లో ఉండటమే కాకుండా, 24 గంటల్లో ఏకంగా 39 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ క్రమంలో సౌత్​ ఇండస్ట్రీలో 24 గంటల్లో అత్యధిక వ్యూవర్​షిప్ సాధించిన ట్రైలర్​గా 'గుంటూరు కారం' రికార్డు సృష్టించింది. ఇదివరకు ఈ రికార్డు 'సలార్' పేరిట ఉంది. ఇటీవల రీలీజైన 'సలార్' ట్రైలర్​కు 24 గంటల్లో 32.50 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ఘాటెక్కనున్న 'గుంటూరు కారం' - టికెట్ ధర పెంపునకు గ్రీన్ సిగ్నల్ - మల్టీప్లెక్స్​లో ఎంతంటే ?

ఏంటి 'గుంటూరు కారం'లో మహేశ్​కు ఆ లోపం ఉందా?

Last Updated : Jan 9, 2024, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.