1980ల నాటి సినీ తారలు ప్రతి ఏటా ఏదో ఒక చోట కలిసి సందడి చేస్తారు. క్రితం సారి 2019లో జరిగిన పదో ఆత్మీయ సమ్మేళనానికి మెగాస్టార్ చిరంజీవి ఇల్లు వేదికైంది. ఆ కార్యక్రమంలో 80వ దశకానికి చెందిన దాదాపు 40 మంది నటులు, నటీమణులు కలిసి సందడి చేశారు. కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఈ వేడుక జరగలేదు. మూడేళ్ల విరామం తర్వాత వీరింతా మళ్లీ కలిశారు. ఈసారి 11 రీయూనియన్‌ను పూనమ్ దిల్లాన్, జాకీ ష్రాఫ్ కలిసి ముంబయిలో ఘనంగా నిర్వహించారు.
మహారాష్ట్రకు చెందిన తీరొక్క వంటకాలతో విందు అదరగొట్టారని సమాచారం. అనంతరం క్విజ్లు, రకరకాల గేమ్‌లతో తారలు ఆడిపాడారు. సాయంత్రం మొదలైన వేడుకలు తెల్లవారుజాము వరకు సాగినట్టు తెలుస్తోంది. ఈ దక్షిణ తారల అత్మీయ సమ్మేళనానికి కొంత మంది ప్రముఖ బాలీవుడ్ తారలను కూడా ఆహ్వానించినట్టు సమాచారం. ముంబయిలో జరిగిన తారల ఆత్మీయ కలయికలో చిరంజీవి, వెంకటేశ్, నరేశ్, రాజ్‌కుమార్, శరత్‌కుమార్, భాగ్యరాజ్, అర్జున్, జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్, సన్నీ డియోల్, సంజయ్ దత్, భాను చందర్, సుహాసిని, ఖుష్భూ, రమ్య కృష్ణన్, లిస్సీ, పూర్ణిమ, రాధ, అంబిక, సరిత, సుమలత, శోభన, రేవతి, మేనక, పూనమ్ దిల్లాన్, నదియా, పద్మిని కే, విద్యాబాలన్, టీనా అంబాని, మీనాక్షి శేషాద్రి, మధూ తదితరులు పాల్గొన్నారు. అయితే, రీయూనియన్‌లో పాల్గొన్న సినీతారలంతా కలిసి తీసుకున్న ఫొటోలు తాజాగా బయటికొచ్చాయి. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవీ చదవండి : అమ్మ, రాధికా ఆంటీతో నన్ను చూసి నాన్న షాకయ్యారు : వరలక్ష్మీ శరత్‌కుమార్
'పొదల మాటున శానిటరీ ప్యాడ్లు మార్చుకునేవాళ్లం'.. కష్టాలు గుర్తుచేసుకున్న జయ