మాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ప్రముఖ నిర్మాతను కోల్పోయింది. తన అపార్ట్మెంట్లో ప్రొడ్యూసర్ జైసన్ జోసెఫ్(44) విగతజీవిగా కనిపించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయన మృతికి గల కారణాలు శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తాయని చెప్పారు.
కుంచాకో బోబన్ నటించిన 'జామ్నాప్యారి', 'లవ కుశ' వంటి చిత్రాలను జోసెఫ్ నిర్మించారు. ఆయన మృతి పట్ల మాలీవుడ్ హీరోలు, నటులు, నిర్మాతలు, దర్శకులు సంతాపం తెలుపుతున్నారు. చిన్నవయసులోనే ఆయనను కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.