ETV Bharat / entertainment

రష్మిక వెంటపడిన బైకర్స్​.. 'నేషనల్​ క్రష్' రెస్పాన్స్​తో ఫ్యాన్స్​ షాక్ - national crush rashmika mandanna

వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతోంది 'నేషనల్​ క్రష్​' రష్మిక మందన. తాజాగా రష్మిక చేసిన ఓ పని.. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇంతకీ రష్మిక ఏం చేసిందో తెలుసా..

fans chase rashmika mandanna
fans chase rashmika mandanna
author img

By

Published : Dec 27, 2022, 5:47 PM IST

రష్మిక మందన.. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ బ్యూటీ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా ఈ సుందరి చేసిన ఓ పని వల్ల.. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. తాము అభిమానించే హీరోయిన్​ అలా చేయడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయానికొస్తే.. ఈ బ్యూటీ నటించిన చిత్రం వారిసు (వారసుడు) 2023 జనవరిలో విడుదల కానుంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్​ చెన్నైలో ఘనంగా జరిగింది. ఫంక్షన్​ అనంతరం తిరిగి వెళ్తున్న రష్మికను కొందరు అభిమానులు బైక్​పై వెంబడించారు. వారిని రష్మిక గమనించింది. కారు ఆపి.. 'హెల్మెట్​ ధరించి బండి నడపండి' అని వారికి స్వీట్​ వార్నింగ్​ ఇచ్చింది. దీనికి 'సరే అక్క' ఆ అభిమానులు బుదులిచ్చారు. కాగా, కోపం వచ్చినా.. దాన్ని కంట్రోల్​ చేసుకుని.. అంత స్వీట్​గా మట్లాడిన రష్మికను నెట్టింట్లో అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది.

ఈ 'నేషనల్​ క్రష్'.. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన వారిసులో దళపతి విజయ్ సరసన నటించింది. ఈ సినిమాలో జయసుధ, శామ్, ప్రభు, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి సందర్భంగా కానుంది. దీనికంటే ఒక రోజు ముందు అజిత్ తునివు కూడా రిలీజ్ అవుతుంది. మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన హిందీ భాషా స్పై థ్రిల్లర్ మిషన్ మజ్నులో కూడా రష్మిక ఆడిపాడనుంది. ఆ చిత్రం జనవరి 20న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.