ETV Bharat / entertainment

అసలు పెళ్లే వద్దనుకున్నాడు.. ఇప్పుడు ఆమెతో పీకల్లోతు ప్రేమలో.. ఆ ఒక్క ఇంటర్వ్యూతో.. - రాకింగ్​ రాకేశ్​

ఆన్​స్క్రీన్​ జోడీగా నటించి.. నిజజీవితంలో కూడా ఒక్కటైన జంటలను చూస్తుంటాం. కామెడీ టైమింగ్​తో నవ్వులు పూయిస్తూ, పంచ్​లు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసే ఆ జోడీ కూడా ఈ కోవకు చెందినదే. అదే రాకింగ్​ రాకేశ్​ - సుజాత జోడీ. వీరిద్దరూ ఇప్పుడు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. మరి వారిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందో వారి మాటల్లోనే తెలుసుకుందాం.

రాకేశ్​-సుజాత
రాకేశ్​-సుజాత
author img

By

Published : Jun 11, 2022, 7:43 AM IST

Updated : Jun 11, 2022, 8:17 AM IST

రాకేశ్​-సుజాత

కామెడీ టైమింగ్​, వైవిధ్యమైన హావాభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు రాకింగ్​ రాకేశ్​. అందుకే చాలా తక్కువ కాలంలోనే ఎక్స్​ట్రా జబర్దస్త్​లో టీమ్​లీడర్​ స్థాయికి చేరుకున్నాడు. మరోవైపు జోర్దార్​ సుజాతగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన సుజాత.. రాకేశ్​ టీమ్​ ద్వారా జబర్దస్త్​లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్​లో నవ్విస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వీరిద్దరూ తమ స్కిట్​లలో కడుపుబ్బా నవ్విస్తూనే లవ్​ట్రాక్​ను నడిపించారు. మొదట ఆన్​స్క్రీన్​ రొమాన్స్​గా ప్రారంభించినా.. ఆ తర్వాత నిజజీవితంలోనూ ప్రేమపక్షులుగా మారారు.

'పెళ్లే వద్దు'... అసలు నాకు పెళ్లే వద్దు అంటూ జబర్దస్త్​లో డైలాగ్​ కొట్టిన రాకేశ్​.. ఇప్పుడు సుజాతతో కలిసి లవ్​ట్రాక్​ నడిపించడం ప్రారంభించాడు. 'ఈ పెళ్లితో నీకు కన్నీళ్లు రావని చెప్పను.. కష్టాలు రావని చెప్పను.. కానీ ఈ రెండూ ఉన్నప్పుడు నీ పక్కన నేను ఉంటానని మాత్రం డెఫినెట్​గా చెప్తా" అంటూ ఒక్క డైలాగ్​ చెప్పి సుజాత మనసును దోచాడు. ప్రస్తుతం సోషల్​మీడియాలో ఎక్కడ చూసిన వీరికి సంబంధించిన విషయాలు, వీడియోలు​ తెగ ట్రెండింగ్​ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈటీవీ భారత్​.. ఈ జోడీతో ముచ్చటించింది. వారి ప్రేమ సంగతులను అడిగి తెలుసుకుంది. దీనిపై మాట్లాడిన రాకేశ్​.. తామిద్దరు జబర్దస్త్​ ద్వారానే దగ్గర అయినట్లు చెప్పాడు. తమ మధ్య బంధాన్ని వివరించాడు.

"మాది నిజమైన ప్రేమే.. ఎంతవరకు వెళ్తుందో చూడాలి. తనకు జబర్దస్త్​లో చేయాలని ఆసక్తి ఉందని తెలిసి.. అప్పటికే వేరే కామెడీ షోలో చేస్తున్న తనను ఇక్కడికి తీసుకొచ్చాను. తను జబర్దస్త్​లోకి వచ్చేటప్పటికే బాగా ఫేమస్​. ఇక్కడ కలిసి పనిచేస్తున్న క్రమంలో మా బంధం బలపడింది. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో తను అర్థం చేసుకోలదు. అంతకుమించిన అదృష్టం మరోటి లేదు. మనకు స్వచ్ఛమైన ప్రేమ దొరికినప్పుడు తీసుకోకపోతే మళ్లీ రాదని నా అభిప్రాయం."

- రాకింగ్​ రాకేశ్​

"ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టే నేను కొన్నాళ్ల క్రితం హెచ్​ఎంటీవీలో పనిచేస్తున్నప్పుడు రాకేశ్​ని ఇంటర్వ్యూ చేశాను. దివాలీ సందర్భంగా ఓ స్పెషల్​ ప్రొగ్రామ్​ కోసం అతడిని పిలిచాము. అతనితో తొలిపరిచయం అప్పుడే. అలా పరిచయం కాస్త ఫ్రెండ్​షిప్​ అయింది. మేము ఇద్దరం ఒకరినొకరం బాగా అర్థం చేసుకోగలం. జీవితంలో మనతో తోడుగా ఉన్న ఎవరైనా సరే మన బాధ్యతలను, కష్టసుఖాలను పంచుకోవాలి. ఆ విషయంలో రాకేశ్​ బెస్ట్​. నన్ను అన్ని విధాలా గౌరవిస్తాడు. రాకేశ్​ చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. అందరితోనూ నిజాయతీగా ఉంటాడు.. ఎలాంటి స్వార్థం ఉండదు."

- సుజాత

'క్రెడిట్​ అంతా రాకేశ్​దే'..: జబర్దస్త్​లో తనకు ఫేం రావడానికి కారణం రాకేశే అని అంటోంది సుజాత. అంతకుముందు ఇతర ఛానెళ్లలో, షోల్లో చేసినా కూడా ఇంత స్వేచ్ఛగా తాను ఎప్పుడూ పనిచేసింది లేదని చెప్తోంది. 'నాకు జబర్దస్త్​లో చేయాలని ఉందని చెప్పినప్పుడు అందుకు సరే అన్నాడు. నేను బయట చేసే స్కిట్​లలో ఎలాంటి తప్పులు చేస్తున్నాను, ఎలా చేయాలి వంటి మెళకువలు చెప్పాడు. అలా నేను ఇక్కడ నిలదొక్కుకోగలిగాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇలా ఉండటానికి కారణం రాకేశే' అని చెప్పింది.

ఇదీ చూడండి : 'మా బంధం ఏంటో చెప్పను.. ఏదైనా జరగొచ్చు.. ఫేక్​ మాత్రం కాదు!'

Last Updated : Jun 11, 2022, 8:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.