ETV Bharat / entertainment

జక్కన్న నెక్ట్స్​ భారీ స్కెచ్​.. ప్రభాస్​-ఎన్టీఆర్​ కాంబోలో పవర్​ఫుల్ మల్టీస్టారర్​! - ఎన్టీఆర్ ప్రభాస్ మల్టీస్టారర్​

మహేశ్​బాబుతో సినిమా తర్వాత ప్రభాస్​-ఎన్టీఆర్​తో కలిసి మల్టీస్టారర్​ ప్లాన్ చేసేందుకు జక్కన్న ప్లాన్​ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతో?

NTR Prabhas multistarrer
జక్కన్న నెక్ట్స్​ భారీ స్కెచ్​.. ప్రభాస్​-ఎన్టీఆర్​ కాంబోలో పవర్​ఫుల్ మల్టీస్టార్!
author img

By

Published : Dec 17, 2022, 3:32 PM IST

ప్రస్తుతం చిత్రసీమలో నడుస్తున్న ట్రెండ్​లో మల్టీస్టారర్ ఒకటి. ఇప్పటికే 'ఆర్‌ఆర్‌ఆర్‌' లాంటి భారీ బడ్జెట్​ చిత్రంలో ఎన్టీఆర్​, రామ్​చరణ్​ లాంటి స్టార్ హీరోలు కలిసి నటించడంతో ఈ మల్టీస్టారర్​పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. దీంతో దర్శకనిర్మాతలు వీటిపై దృష్టి పెట్టి కథలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు ఇంట్రెస్టింగ్​ కాంబోల గురించి గాసిప్స్​ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్​ కాంబో గురించి వార్తలు వస్తున్నాయి.

అదేంటంటే.. ఇప్పటికే ఆర్​ఆర్ఆర్​తో మల్టీస్టారర్​ చేసిన రాజమౌళి.. మళ్లీ అలాంటి జోనర్​లోనే సినిమా తీయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం సూపర్​ స్టార్​ మహేశ్ బాబుతో అడ్వెంచర్ నేపథ్యంలో ఆయన సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయ్యాక ఆయన నెక్ట్స్​ ప్లాన్​ ఏంటి అనేది ఇప్పుడే తైరపైకి వచ్చేసింది. ఇప్పుడిప్పుడే దీని గురించి చర్చ ప్రారంభమైంది. మహేశ్​తో సినిమా తర్వాత మరో పవర్ ఫుల్​​ మల్టీస్టారర్​​ సినిమా కోసం ప్లాన్​ చేస్తున్నారంట జక్కన్న. అదే ప్రభాస్-ఎన్టీఆర్ కాంబో.

ఇప్పటికే బాహుబలితో ప్రభాస్​-ఆర్​ఆర్​ఆర్​తో ఎన్టీఆర్​ పాన్​ ఇండియా హీరోలుగా మారిపోయారు. అంతేకాకుండా వారి క్రేజ్​ కూడా ఈ చిత్రాలతో దేశవ్యాప్తమే కాకుండా ఇంటర్నేషనల్​ రేంజ్​లో పెరిగిపోయింది. అందుకే వీరిద్దరి కలయికో ఓ పవర్​ ప్యాక్డ్​డ్​ పాన్ వరల్డ్​ సినిమా తీయాలని జక్నన్న ఆలోచించినట్లు కథనాలు వస్తున్నాయి. మహేశ్ సినిమా తర్వాత దీని మీద పని చేయాలని అనుకుంటున్నారట. అయితే ఇందులో నిజమెంతో తెలియదు గానీ ఇది వినగానే సినీ ప్రేక్షకులు మాత్రం ఈ కాంబో నిజమైతే బాగుండు అని ఆశిస్తున్నారు. ఇంకొంత మంది గాసిప్ అదిరిందిలే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఇప్పటికే ప్రభాస్​తో మూడు ఎన్టీఆర్​తో నాలుగు చిత్రాలు చేశారు రాజమౌళి.

ఇదీ చూడండి: అది కోహ్లీ రేంజ్​.. ఆ లిస్ట్​ టాప్​-5లో చోటు.. కత్రిన, అలియా కూడా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.