ETV Bharat / entertainment

శ్రుతిహాసన్​తో లవ్​​.. ట్రోల్స్​పై దర్శకుడు గోపిచంద్​ రియాక్షన్​ ఇదే! - దర్శకుడు గోపిచంద్​ శ్రుతిహాసన్ లవ్​ ట్రోల్స్​

ఇటీవలే దర్శకుడు గోపిచంద్​.. శ్రుతిహాసన్​కు ఐ లవ్​ యూ చెప్పడంపై నెటింట్లో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. తాజాగా దీనిపై​ గోపిచంద్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

Shrutihassan Director Gopichand
శ్రుతిహాసన్​తో లవ్​​.. ట్రోల్స్​పై దర్శకుడు గోపిచంద్​ రియాక్షన్​ ఇదే!
author img

By

Published : Jan 19, 2023, 10:33 AM IST

Updated : Jan 19, 2023, 1:22 PM IST

హీరోయిన్​ శ్రుతిహాసన్​ ​-దర్శకుడు గోపిచంద్​ మలినేని కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు కలిసి బలుపు, క్రాక్​, వీరసింహారెడ్డి ఇలా మూడు హిట్లను అందుకున్నారు. పలు సందర్భాల్లోన్లూ శ్రుతి అంటే తనకు ఎంత అభిమానమో తెలిపారు గోపిచంద్​. అయితే ఇటీవలే వీరసింహా ప్రీ రిలీజ్ ఈవెంట్​లో ​ ఆయన.. శ్రుతికి ఐ లవ్​ యూ చెప్పిన సంగతి తెలిసిందే. దానికి ఆమె బదులిస్తూ ఐ లవ్ యూ అన్నయ్య అని చెప్పింది. అయితే దీనికి సంబంధించిన వీడియోలను నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు.

అయితే తాజాగా దీనిపై గోపిచంద్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. "శ్రుతితో నాకు మూడో సినిమా. ఆమె అంటే చాలా ఇష్టం. మా కుటుంబంలోని అమ్మాయిలా చూస్తా. నా భార్యతో కూడా ఆమెకు మంచి అనుబంధం ఉంది. మా ఇద్దరిది అన్నా-చెల్లి బంధం. నేను ఓ అన్నయ్యగా ఐ లవ్​ యూ చెబితే.. సోషల్​మీడియాలో దానికి రివర్స్​ చేసి మసాలా యాడ్​ చేసి చూపించారు." అని అన్నారు.

ఇక వీరసింహారెడ్డి విషయానికొస్తే.. 'అఖండ' తర్వాత అదే రేంజ్​లో ఫుల్​జోష్​తో వచ్చిన నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన సినిమా ఇది. సంక్రాంతికి భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా సూపర్​ హిట్​ టాక్​తో దూసుకుపోతోంది. తొలి రోజు నుంచే మంచి వసూళ్లను అందుకుంటూ బాక్సాఫీస్​ వద్ద అదరగొడుతోంది. ముఖ్యంగా బాలయ్య యాక్టింగ్‌, యాక్ష‌న్ సీక్వెన్స్ అభిమానుల‌ను విపరీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. బాలయ్య సరసన శృతిహాస‌న్‌, మలయాళీ భామ హ‌నీ రోజ్ హీరోయిన్లుగా న‌టించారు. బాల‌కృష్ణ సోద‌రిగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ న‌టించింది. దునియా విజ‌య్ విల‌న్‌గా న‌టించారు. తమన్ సంగీతం అందించారు.

ఇదీ చూడండి: ఓరి దేవుడా.. మస్తు మస్తుగా ముద్దుగుమ్మల కిరాక్ పోజులు

Last Updated : Jan 19, 2023, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.