Boyapati Rapo Release Date : ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం అందరి అంచనాలను పెంచేస్తోంది. 'బోయపాటి రాపో' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ అభిమానుల్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసిన మూవీ టీమ్ సినిమా.. ప్రేక్షకుల కోసం రిలీజ్ డేట్‌ను ఖరారు చేసింది. ఓ పల్లెటూరి వాతావరణంలో మంచంపై పంచెకట్టులో కూర్చున్న రామ్.. ఇక ఆయన చేతిలో ఓ కాఫీ కప్.. ఇలా పచ్చటి పొలాల మధ్య స్టైలిష్ లుక్‌లో రామ్ కనిపిస్తున్నారు. 'వీ ఆర్ కమింగ్ ఇన్ ఎర్లీ'( మేము ముందుగానే వచ్చేస్తున్నాము) అంటూ ఆ పోస్ట్‌ను షేర్ చేసిన మూవీ టీమ్ అందులో సెప్టెంబర్ 15న సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
అంటే అప్పట్లో ఈ సినిమాను అక్టోబర్ 20న విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఈ సినిమా కోసం దసరా వరకు వేచి చూడాలనుకున్న అభిమానులకు ఈ వార్త తీయ్యటి కబురులా అనిపించింది. అయితే ఇప్పటికీ ఆ పోస్టర్లో 'బోయపాటిరాపో' అనే వర్కింగ్ టైటిల్ ఉండటం వల్ల ఇంకా ఈ సినిమాకు పేరు ఎందుకు పెట్టలేదంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ విషయంలో చిత్ర బృందం మాత్రం 'స్కంద' అనే పేరు పెడితే ఎలా ఉంటుందనే విషయంపై చర్చిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వచ్చే అవకాశాలున్నాయని సినీ వర్గాల టాక్.
-
We are coming in Early..
— RAm POthineni (@ramsayz) June 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
15th of Sep,2023. https://t.co/v5SKaUMkkn
">We are coming in Early..
— RAm POthineni (@ramsayz) June 23, 2023
15th of Sep,2023. https://t.co/v5SKaUMkknWe are coming in Early..
— RAm POthineni (@ramsayz) June 23, 2023
15th of Sep,2023. https://t.co/v5SKaUMkkn
Boyapati Srinu- Rampothineni : భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో రామ్ సరసన శ్రీలీ నటిస్తోంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ పూర్తి మాస్ లుక్‌లో సందడి చేయనున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా.. శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, భాషల్లో వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నారు.
మరోవైపు సినిమాల విషయంలో హీరో రామ్ తన స్పీడ్‌ను పెంచినట్లుగా కనిపిస్తున్నారు. గతేడాది వచ్చిన 'ది వారియర్' సినిమాను తెలుగుతో పాటు తమిళంలో ఒకేసారి రిలీజ్ చేశారు రామ్. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న తర్వాత బోయపాటి చేస్తున్న చిత్రం బోయపాటి రాపో. దీంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు అడియెన్స్. మరి శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కూడా అఖండ విజయం సాధిస్తుందో లేదో తెలియాలంటే సెప్టెంబర్ 15 వరకు వెయిట్ చేయాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">