ETV Bharat / entertainment

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం - నిర్మాత దిల్ రాజు తండ్రి కన్నుమూత

Dilraju Father Died: ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు పితృవియోగం. ఆయన తండ్రి శ్యామ్‌సుందర్‌రెడ్డి (86) కన్నుమూశారు.

Dilraju Father Died:  దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 9:24 PM IST

Updated : Oct 9, 2023, 9:59 PM IST

Dil raju Father Died : సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య తగ్గడం లేదు. నిత్యం ఏదో ఒక బ్యాడ్ న్యూడ్ వినిపిస్తూనే ఉంది. సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నికల్ టీమ్​.. లేదా వారి కుటుంబ సభ్యులకు చెందిన ఎవరొకరు కన్నుమూశారనే వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా తెలుగు చిత్రసీమ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

దిల్ రాజు తండ్రి శ్యామ్​ సుందర్ రెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన వయసు ఇప్పుడు 86 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న ఆయన ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత ఆయన కన్నుమూసినట్లు తెలిసింది. కాగా, శ్యామ్‌ సుందర్‌రెడ్డి స్వస్థలం నిజామాబాద్‌ జిల్లాలోని నర్సింగ్‌పల్లి. ఆయనకు ముగ్గురు సంతానం. వీరిలో దిల్​ రాజుతో పాటు విజయ్ సింహారెడ్డి, నరసింహారెడ్డి ఉన్నారు.

Dil raju Family : నిర్మాత దిల్‌ రాజు అసలు పేరు వెంకట రమణారెడ్డి. చిన్నతనం నుంచే ఆయన్ను కుటుంబ సభ్యులంతా రాజు అని పిలిచేవారు. స్వస్థలం నిజామాబాద్‌. పైచదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. సినీ పరిశ్రమలోకి వచ్చే ముందు దిల్‌ రాజు పలు వ్యాపారాలు కూడా చేశారు. ఆ తర్వాత సినీ డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. 'దిల్‌' సినిమాతో నిర్మాతగా మారారు. ఆ సినిమా హిట్‌ కావడం వల్ల అప్పటి నుంచి ఆయన పేరు 'దిల్‌ రాజు'గా మారింది.

Dil Raju Upcoming Movies : ఇకపోతే దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత. వీరికి హన్షిత అనే కుమార్తె కూడా ఉంది. అయితే అనిత ఆరోగ్యం బాగోలేక కన్నుమూశారు. దీంతో 2020లో తేజస్విని అనే మహిళను వివాహం చేసుకున్నారు దిల్​రాజు. వీరికి ఓ బాబు జన్మించారు. ప్రస్తుతం దిల్​రాజు.. దిగ్గజ దర్శకుడు శంకర్​ - రామ్​చరణ్​తో కలిసి గేమ్​ ఛేంజర్​ అనే భారీ బడ్జెట్​ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Vijay Devarkonda Upcoming Movies : దిల్​ రాజుతో రౌడీ హీరో మరో కొత్త సినిమా.. డైరెక్టర్​ ఎవరంటే?

Dil Raju Game Changer Movie Update : అదేంటి.. ఆ విషయం దిల్​ రాజుకు కూడా తెలియదా?

Last Updated : Oct 9, 2023, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.