ETV Bharat / entertainment

'ధూమ్'​ డైరెక్టర్ సంజయ్ గాధ్వి కన్నుమూత - ప్రముఖుల సంతాపం! - వినోద్ థామస్ మృతి

Dhoom Director Died : ప్రముఖ​ బాలీవుడ్ డైరెక్టర్​ సంజయ్​ గాధ్వి గుండెపోటుతో మరణించారు. 'ధూమ్', 'ధూమ్​ 2' చిత్రాలకు సంజయ్​ దర్శకత్వం వహించారు.

Dhoom Director Died
Dhoom Director Died
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 19, 2023, 12:58 PM IST

Updated : Nov 19, 2023, 3:07 PM IST

Dhoom Director Died : ప్రముఖ​ డైరెక్టర్​ సంజయ్​ గాధ్వి (57) గుండెపోటుతో ఆదివారం మరణించారు. దీంతో యవత్త్​ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. మార్నింగ్ వాక్​ చేస్తున్న సమయంలో.. గుండె నొప్పి రావటం వల్ల ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సంజయ్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ మరణ వార్తతో బాలీవుడ్​లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువులు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.

'ధూమ్', 'ధూమ్​ 2' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను సంజయ్ గాధ్వి తెరకెక్కించారు. 2000లో 'తేరే లియే' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. అయితే ఈ సినిమా అభిమానులను అంతగా ఆకట్టులేకపోయింది. ఆ తర్వాత 2004లో యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ధూమ్‌'కి దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా, హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్, బిపాసా బసు నటించిన 'ధూమ్ 2' సీక్వెల్ వచ్చింది. దీంతో యశ్ రాజ్ ఫిల్స్మ్ ని అందనంత ఎత్తుకి తీసుకెళ్లింది. ఇంక ఆ తరువాత సంజయ్.. 'కిడ్నాప్', 'మేరే యార్​ కి షాదీ హై', 'అజబ్ గజబ్ లవ్', 'ఆపరేషన్ పరిందే' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

కారులో విగతజీవిగా కనిపించిన మలయాళ నటుడు
Vinod Thomas Kerala Actor.. మలయాళ నటుడు వినోద్ థామస్​ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కేరళ కొట్టాయం జిల్లా పంపాడి సమీపంలోని ఓ హోటల్​లో పార్క్ చేసిన కారులో శవమై కనిపించాడు. హోటల్ యాజమాన్యం గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అప్పటికే వినోద్ చనిపోయినట్లు తెలిపారు. మరణానికి గల కారణామేంటో ఇంకా తెలియలేదు. కారులో ఎయిర్ కండినషర్ సిస్టమ్​ నుంచి వస్తున్న విషపూరితమైన వాయువులు రావటం పోలీసులు గుర్తించారు. ఆ కారణంగానే మరణించి ఉండొచ్చుని పోలీసులు భావిస్తున్నారు. 'అయ్యప్పనుమ్ కోషియుమ్​' ,'నాతోలి ఒరు చెరియా మీనల్లా', 'హ్యాపీ వెడ్డింగ్', 'జూన్' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

సీనియర్ నటుడు చంద్రమోహన్​ కన్నుమూత

సీనియర్​ నటుడు, మాజీ ఎంపీ కన్నుమూత.. సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

Last Updated : Nov 19, 2023, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.