ETV Bharat / entertainment

పార్వతిగా దీపికా పదుకొణె.. 'బ్రహ్మాస్త్ర-2'లో రణ్​బీర్​ కపూర్ సరసన! - ranbir kapoor and Deepika Padukone

రణ్​బీర్​ కపూర్ ప్రధాన పాత్రలో 'బ్రహ్మాస్త్ర-2' సినిమా సిద్ధం అవుతోంది. ఇప్పటికే బ్రహ్మాస్త్ర పార్ట్​-1 పూర్తి కాగా.. ఇందులో రణ్​బీర్​- ఆలియా హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే రెండో భాగం కోసం రణ్​బీర్​ కపూర్ సరసన నటించేందుకు దీపికా పదుకొణెను తీసుకోనున్నారట.

Deepika Padukone to play parvati in ranbir kapoor and alia bhatt movie brahmastra 2
పార్వతిగా దీపికా పదుకొణె.. 'బ్రహ్మాస్త్ర-2' రణ్​బీర్​ కపూర్ సరసన!
author img

By

Published : Jul 19, 2022, 12:31 PM IST

Updated : Jul 19, 2022, 12:37 PM IST

బాలీవుడ్ మాజీ లవర్స్​ రణ్​బీర్​ కపూర్​- దీపికా పదుకొణెకు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. రణ్​బీర్​- దీపికా పదుకొణె కలిసి పనిచేయనున్నట్లు సమాచారం. 'బ్రహ్మాస్త్ర-2'లో బలమైన పార్వతి పాత్ర కోసం దీపికను ఎంపిక చేశారట దర్శకుడు అయాన్ ముఖర్జీ.

ఇప్పటికే బ్రహ్మాస్త్ర మొదటి భాగం పూర్తయ్యింది. ఇందులో రణ్​బీర్​- ఆలియా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్​ 9న విడుదల కానుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కింగ్​ నాగార్జున, మౌని రాయ్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

మొదటి భాగం అన్ని పనులు పూర్తి చేసుకొని.. విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో.. పార్ట్​-2పై దృష్టి పెట్టాడట దర్శకుడు. ఇప్పటికే కథను సిద్ధం చేసినట్లు సమాచారం. అందులో పార్వతి పాత్రను దీపికా పదుకొణెను దృష్టిలో పెట్టుకొని రాసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొదటి భాగంలో అతిథి పాత్రలో దీపిక నటించినట్లు తెలుస్తోంది. ఆ పాత్రే.. రెండో భాగంలో లీడ్​ రోల్​ అయ్యే అవకాశం ఉందని బీ టౌన్​ వర్గాల సమాచారం.

ఒక వేళ.. దీపిక-రణ్​బీర్ కలిసి నటిస్తే.. కచ్చితంగా క్రేజీ ​ కాంబినేషన్​ అవుతుంది. ప్రేమికులుగా వీరు విడిపోయిన తర్వాత.. కలిసి నటించిన తొలి చిత్రం ఇదే అవుతోంది. 2015లో వచ్చిన 'తమాషా' తర్వాత రణ్​బీర్-దీపిక జంటగా నటించలేదు. 2018లో రణ్​వీర్​ సింగ్​ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి రణ్​బీర్​తో కలిసి కనపడలేదు దీపిక. రణ్​బీర్​ కూడా తన ప్రేయసి ఆలియా భట్​ను వివాహం చేసుకున్నాడు.

ఇదీ చదవండి: లెజెండరీ ​సింగర్​ కన్నుమూత.. ప్రధాని సహా ప్రముఖుల సంతాపం

Last Updated : Jul 19, 2022, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.