ETV Bharat / entertainment

ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు ఇకలేరు

author img

By

Published : Jul 6, 2022, 7:07 AM IST

Updated : Jul 6, 2022, 10:49 AM IST

Editor Gowtham raju died: గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు(68) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Editor Gowtham raju died
ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు ఇకలేరు

Editor Gowtham raju died: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు(68) తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. గౌతమ్‌ రాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు. గౌతమ్‌రాజు కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఎన్నో చిత్రాలకు గౌతమ్‌రాజు ఎడిటర్‌గా పనిచేశారు. సుమారు 800 చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసి సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా తెలుగులో తెరకెక్కిన ఎన్నో హిట్‌ చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రముఖ నటులు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ నటించిన ఎన్నో సినిమాలకు ఆయన పనిచేశారు. 'ఆది', 'ఖైదీ నెంబర్‌ 150', 'గబ్బర్‌సింగ్‌', 'కిక్‌', 'రేసుగుర్రం', 'గోపాల గోపాల', 'అదుర్స్‌', 'బలుపు', 'రచ్చ', 'ఊసరవెల్లి', 'బద్రీనాథ్', 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌', 'కాటమరాయుడు' తదితర ప్రాజెక్ట్‌లతో ఆయన సినీ ప్రేక్షకుడి మది గెలుచుకున్నారు. 'చట్టానికి కళ్లులేవు' సినిమాతో గౌతమ్‌రాజు ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. 'ఆది' చిత్రానికి ఉత్తమ ఎడిటర్‌గా నంది అవార్డును అందుకున్నారు.

చిరు సంతాపం: సినీ ఎడిటర్‌ గౌతమ్‌రాజు మృతి పట్ల చిరంజీవి దిగ్భ్రాంతి చెందారు. గొప్ప ఎడిటర్‌ను కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. "గౌతమ్‌రాజు ఎంత సౌమ్యుడో.. ఆయన ఎడిటింగ్‌ అంత వాడి. ఆయన మితభాషి.. ఆయన ఎడిటింగ్‌ మెలకువలు అపరిమితం. ఎంత నెమ్మదస్తుడో.. ఆయన ఎడిటింగ్‌ అంత వేగం. ఆయన లేకపోవడం వ్యక్తిగతంగా నాకు, సినీ పరిశ్రమకు పెద్ద లోటు. నా అనేక సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు. 'చట్టానికి కళ్లు లేవు' నుంచి 'ఖైదీ నం 150' వరకు ఎన్నో చిత్రాలు చేశారు." అని చిరు అన్నారు.

ఇదీ చూడండి: దాని కోసం చాలా కష్టపడ్డా.. నా డ్రీమ్‌ రోల్​ అదే: కృతిశెట్టి

Last Updated : Jul 6, 2022, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.