ETV Bharat / entertainment

మెగా ఫ్యామిలీలో సెలబ్రేషన్స్​.. స్టార్స్​ అంతా ఒకే ఫ్రేమ్​లో.. ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ! - రామ్​చరణ్​ లేటెస్ట్​ న్యూస్​

మెగా ఫ్యామిలీలో సెలబ్రేషన్స్‌ షురూ అయ్యాయి. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలను పురస్కరించుకుని రామ్‌చరణ్‌ ఇంట వేడుకలు జరిగాయి.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Dec 21, 2022, 12:18 PM IST

క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తన కుటుంబ సభ్యులందరికీ మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌-ఉపాసన స్పెషల్‌ పార్టీ ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని చరణ్‌ నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో మెగా కజిన్స్‌ అల్లు అర్జున్‌ - స్నేహా దంపతులు, వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, నిహారిక, శిరీష్‌, సుస్మితా, శ్రీజ తదితరులు పాల్గొన్నారు.

christmas party at ramacharan house
క్రిస్మస్​ వేడుకల్లో స్నేహా రెడ్డి

సరదా మాటలు, గేమ్స్‌తో ఎంజాయ్‌ చేశారు. సీక్రెట్‌ శాంతా గేమ్‌లో భాగంగా పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఓ ఫొటోని ఉపాసన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. స్టార్స్‌తో నిండిపోయిన ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన ప్రతిఒక్కరూ.. 'కడుపు నిండిపోయింది', 'రెండు కళ్లూ చాలడం లేదు' అంటూ తమ ఆనందాన్ని తెలుపుతున్నారు. ఉపాసన తల్లికానున్న తరుణంలో మెగా కుటుంబానికి ఈ ఏడాది వేడుకలు మరింత స్పెషల్‌గా మారాయి.

christmas party at ramacharan house
క్రిస్మస్​ వేడుకల్లో ఉపాసన
christmas party at ramacharan house
క్రిస్మస్​ వేడుకల్లో మెగా కుటుంబం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.