Chiranjeevi Vasishta Movie : బింబిసార దర్శకుడు వశిష్ఠ - మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ఓ సోషియో ఫాంటసీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పంచభూతాల నేపథ్యంలో విజువల్ వండర్‌గా రాబోతుంది. బింబిసార లాంటి హిట్ చిత్రం తర్వాత వశిష్ఠ తెరకెక్కిస్తున్న చిత్రం కావడం వల్ల... ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో, విజువల్ గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
పైగా అటు ఆడియెన్స్‌తో పాటు ఇటు అభిమానులు కూడా చిరును తన వయసుకు తగ్గ పాత్రల్లో చూడాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. రొట్ట డ్యాన్స్, హీరోయిన్స్‌తో రొమాన్స్ పక్కన పెట్టి కొత్తగా చేయాలని సూచిస్తున్నారు. ఇప్పుడు అందుకు తగ్గట్టే.. ఈ మెగా 157లో చిరు కనపడనున్నారని అర్థమైంది. ఈ విషయాన్ని దర్శకుడు వశిష్ఠ కూడా కన్ఫామ్ చేశారు.
తాను చిన్నతనంలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేసినట్లు తాజా ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు వశిష్ఠ. అప్పటి పిల్లలకు ఆ చిత్రం అంటే చాలా బాగా ఇష్టమని.. అలాగే ఇప్పటి పిల్లలకు కూడా అలాంటి చిరునే చూపిస్తానని అన్నారు. సినిమాలో నాలుగురు హీరోయిన్ల వరకు ఉంటారు కానీ.. వారితో ఎలాంటి రొమాన్స్ సన్నివేశాలు ఉండవట. కేవలం ఇతర కీలక పాత్రల రూపంలోనే వాళ్లు ఉంటారట. వారిలో ఇప్పటికే అనుష్క శెట్టి పేరు ఫైనలైజ్ అయినట్లు సమాచారం అందింది. ఇతర హీరోయిన్లను ఎవరిని తీసుకోవాలో అనే పనిలో మూవీటీమ్ ఉందట.
Chiranjeevi Vasishta Movie Release Date : ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ లేదా డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిసింది. 2025 సంక్రాంతికి లేదా మార్చికి చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట. అందుకు తగ్గట్టు ప్రణాళిక రచించుకుని ముందుకెళ్లేలా చూస్తున్నారని తెలిసింది. ఇక ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌కు పెద్ద పీట వేయనున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే పలు స్టూడియోలతో చర్చలు జరుపుతున్నట్లు వశిష్ఠ చెప్పారు. అయితే అన్నింటికీ మించి స్టోరీ, స్క్రీన్‌ప్లేనే సినిమాకు బలమని అన్నారు.
-
A MEGA Start to the MEGA Film 🌟#MEGA157 is coming to life as we kick-off the pre-production works!
— Vassishta (@DirVassishta) September 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
We are ready to take you all on a cinematic adventure soon!@KChiruTweets @UV_Creations @NaiduChota pic.twitter.com/6qXLlsbqds
">A MEGA Start to the MEGA Film 🌟#MEGA157 is coming to life as we kick-off the pre-production works!
— Vassishta (@DirVassishta) September 10, 2023
We are ready to take you all on a cinematic adventure soon!@KChiruTweets @UV_Creations @NaiduChota pic.twitter.com/6qXLlsbqdsA MEGA Start to the MEGA Film 🌟#MEGA157 is coming to life as we kick-off the pre-production works!
— Vassishta (@DirVassishta) September 10, 2023
We are ready to take you all on a cinematic adventure soon!@KChiruTweets @UV_Creations @NaiduChota pic.twitter.com/6qXLlsbqds
Chiranjeevi Aishwarya Rai : ఇది చదివారా.. చిరంజీవి కోసం ఐశ్వర్యా రాయ్!
Mega 157 Latest Update : మెగా 157 సూపర్ అప్డేట్.. ఇంతకీ ఏంటంటే?