ETV Bharat / entertainment

17ఏళ్ల తర్వాత మళ్లీ చిరు-త్రిష.. కన్ఫామ్​ అయినట్టే! - chiru bholashankar

Chiranjeevi Trisha : గతంలో 'స్టాలిన్'​ సినిమాలో కలిసి నటించిన మెగాస్టార్ చిరంజీవి-త్రిష మళ్లీ ఇప్పుడు 17ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్నట్లు తెలిసింది. ఆ వివరాలు..

After 17 years Chiru pairs up with Trisha
17ఏళ్ల తర్వాత మళ్లీ చిరు-త్రిష.. కన్ఫామ్​ అయినట్టే!
author img

By

Published : Jun 28, 2023, 4:46 PM IST

Chiranjeevi Trisha : చిత్రసీమలో ఓ సినిమాను పట్టాలెక్కించేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో దర్శకులు, నిర్మాతలు, నటీనటుల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తుంటాయని మనం వింటూనే ఉంటాం. అలా వారు ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తుంటాయి. కానీ కొంతకాలం తర్వాత మరో సినిమా కోసం వారు కలుస్తుంటారు. అలా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి- గ్లామర్ క్వీన్ త్రిష కలిసి తమ కొత్త సినిమా కోసం కలిసి పనిచేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా చిరు నటించనున్న కొత్త సినిమాలో హీరోయిన్​గా నటించడానికి ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే.. మెగాస్టార్​ చిరంజీవి త్వరలోనే 'భోళాశంకర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అదే సమయంలో తన కొత్త సినిమాకి సంబంధించిన పనుల్లోనూ బిజీగా ఉంటున్నారు. అయితే ఈ చిత్రంలో నటీనటుల ఎంపికపై కొన్నాళ్లుగా కసరత్తులు జరగుతున్న సంగతి తెలిసిందే. దీనికి బంగార్రాజు ఫేమ్​ కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వం వహించనున్నారట. తండ్రీ కొడుకుల​ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని తెలిసింది. ఈ సినిమాలోనే చిరంజీవి భార్యగా త్రిషగా కనిపించనుందని తెలిసింది. త్వరలోనే అధికార ప్రకటన రానుందట. ఇకపోతే ఈ చిత్రంలో యంగ్ హీరో డీజె టిల్లు ఫేమ్​ సిద్ధు జొన్నలగడ్డ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నారట. మలయాళంలో సూపర్​ హిట్​గా నిలిచిన 'బ్రో డాడీ'కి రీమేక్‌గా ఈ మూవీ రూపొందనుందట. చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

17ఏళ్ల తర్వాత.. చిరంజీవి-త్రిష కలిసి గతంలో 'స్టాలిన్'​ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా వచ్చి దాదాపు 17ఏళ్లు అయింది. ఆ తర్వాత 'ఆచార్య' కోసం వీరిద్దరు కలిసి నటించనున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్​ కారణంగా త్రిష సినిమా నుంచి తప్పుకున్నట్లు అన్నారు. ఇప్పుడు తాజా వార్త నిజమైతే.. ఈ జంట మళ్లీ 17ఏళ్ల తర్వాత కలిసి నటించినట్టవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

chiru bholashankar : ఇక 'భోళాశంకర్' సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రం ఆగస్టు 11న రిలీజ్​ కానుంది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి కథానాయకుడిగా, తమన్నా కథానాయికగా నటిస్తోంది. చిరుకు చెల్లెలిగా కీర్తిసురేశ్‌ నటించింది. మరో నటుడు సుశాంత్‌ కీలక పాత్ర పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్​పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ ఇటీవలే విడుదలై అభిమానులను ఆకట్టుకుంది. మాస్‌, యాక్షన్‌ అంశాలతో సినిమా రూపొందుతోందని అర్థమవుతోంది. ఇందులో చిరంజీవి స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మహతి స్వరసాగర్‌ అందిస్తున్నారు. డడ్లీ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.

ఇదీ చూడండి :

త్రిషకు మాత్రమే అలా కుదిరిందోచ్

PS-2 ప్రీరిలీజ్​ ఈవెంట్​.. రాయల్​ లుక్​లో విక్రమ్​.. ఐశ్వర్య, త్రిష అందాలకు గెస్ట్​లు ఫిదా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.