ETV Bharat / entertainment

కథానాయకులు బిజీ బిజీ.. ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ - విజయ్​దేవరకొండ ఖుషి

కరోనా తర్వాత వరసగా సినిమాలు పట్టాలెక్కడంతో చిత్రసీమ ఊపిరి పీల్చుకుంది. ఏటా ఒక్క చిత్రమే కష్టంగా మారిన తరుణంలో పెద్ద, చిన్న హీరోలు ఈసారి పంథా మార్చారు. చాలా మంది కథానాయకులు రెండు మూడు సినిమాలతో సందడి చేసేస్తున్నారు. ఇంతకీ వారు ఎవరు? ఏ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు? తెలుసుకుందాం..

Chiranjeevi upcoming movies
కథానాయకులు బిజీ.. అభిమానులు ఖుషీ
author img

By

Published : Jul 9, 2022, 6:36 AM IST

కరోనా తర్వాత చిత్రసీమలో ఒక రకమైన అనిశ్చితి వాతావరణం నెలకొంది. ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. ఏ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో తెలియని పరిస్థితి. 2022 ఆరంభంలోనూ అదే రకమైన గందరగోళమే. ఆ తర్వాతే చిత్రసీమ గాడిన పడింది. రెండు మూడేళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన సినిమాలు ఒకొక్కటిగా విడుదలవడం... కొత్త కాంబినేషన్లతో సినిమాలూ పట్టాలెక్కడం... బాక్సాఫీసు దగ్గర పూర్వ వైభవం కనిపించడంతో చిత్రసీమ ఊపిరి పీల్చుకుంది. ఈ ఆరు నెలల ప్రయాణాన్ని చూసి కథానాయకులు, దర్శకనిర్మాతలు, వ్యాపార వర్గాలు... మళ్లీ మనుపటిలా ప్రణాళికలు వేసుకోవడం మొదలుపెట్టారు. ఏటా ఒక్క చిత్రమే కష్టంగా మారిన తరుణంలో పెద్ద, చిన్న హీరోలు ఈసారి పంథా మార్చారు. చాలా మంది కథానాయకులు రెండు మూడు సినిమాలతో సందడి చేస్తున్నారు. వారి జోరు చూసి అభిమానుల్లో జోష్‌ పెరుగుతోంది.

Chiranjeevi upcoming movies: అగ్ర కథానాయకుడు చిరంజీవి చేస్తున్న సినిమాల జాబితా చాలా పెద్దదే. అందుకు తగ్గట్టే ఆయన సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి. ఇప్పటికే 'ఆచార్య'గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన దసరాకి 'గాడ్‌పాదర్‌'తోనూ, సంక్రాంతికి మరో కొత్త సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆ లెక్కన పది నెలల వ్యవధిలో మూడు చిత్రాలతో సందడి చేసినట్టవుతుంది. మరోపక్క 'భోళాశంకర్‌' చిత్రీకరణ శరవేగంగానే సాగుతోంది. రానా దగ్గుబాటి నటించిన సినిమాలు ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. '1945', 'భీమ్లానాయక్‌', 'విరాటపర్వం' చిత్రాలతో ఆయన సందడి చేశారు. 'రానానాయుడు' పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో ఓ సిరీస్‌ చేశారు. అది ఈ సంవత్సరంలోనే స్ట్రీమ్‌ కానుంది.

రవితేజ ఇప్పటికే 'ఖిలాడి'తో సందడి చేశారు. ఈ నెల 29న 'రామారావు ఆన్‌ డ్యూటీ' అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. మరోపక్క 'రావణాసుర', 'ధమాకా' సినిమాల్నీ పూర్తి చేయడంపై దృష్టిపెట్టారు. వాటిలోనూ ఓ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. నాగచైతన్య ఈ సంవత్సరం ఆరంభంలో 'బంగార్రాజు'తో ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించాడు. ఈ నెలలోనే 'థ్యాంక్‌ యూ'తో వస్తున్నాడు. మరోపక్క హిందీలో ఆమిర్‌ఖాన్‌తో కలిసి నటించిన 'లాల్‌సింగ్‌ చద్దా' వచ్చే నెలలో విడుదలవుతోంది. మొత్తంగా ఆయనా ఈ సంవత్సరమే మూడు సినిమాలతో సందడి చేసినట్టవుతుంది.

రెండేసి సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకుల్ని అలరించిన తారలు చాలామందే కనిపిస్తున్నారు. యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌ ఇప్పటికే 'గని', 'ఎఫ్‌3'తో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 'గని'తో పరాజయాన్ని చవిచూసినా 'ఎఫ్‌3'తో నవ్వించారు. 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' తర్వాత విజయ్‌ దేవరకొండ నుంచి సోలోగా మరో సినిమా రాలేదు. ఈసారి ఆయన రెండు సినిమాలతో సందడి చేస్తారు. 'లైగర్‌' ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకొస్తుండగా, కొత్త చిత్రం 'ఖుషి' క్రిస్మస్‌ సందర్భంగా ఈ సంవత్సరం చివర్లో విడుదలవుతుంది. అడవి శేష్‌ 'మేజర్‌'తో విజయాన్ని అందుకున్నారు.

ఆయన నటించిన 'హిట్‌: ది సెకండ్‌కేస్‌' ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. ఈ నెలలోనే 'కార్తికేయ2'తో సందడి చేయనున్న నిఖిల్‌... '18 పేజీస్‌'ని పూర్తి చేశారు. అది సెప్టెంబరులో విడుదల కానుంది. 'స్పై'నీ పూర్తి చేసే పనిలో ఉన్నారు. సత్యదేవ్‌ ఇప్పటికే 'గాడ్సే'గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయన నటించిన 'గుర్తుందాశీతాకాలం' త్వరలోనే విడుదల కానుంది. మరో చిత్రం 'కృష్ణమ్మ' సెప్టెంబరులో రానున్నట్లు ప్రకటించారు. నాని, శర్వానంద్‌, శ్రీవిష్ణు ఈ సంవత్సరం రెండేసి సినిమాలతో సందడి చేసే కథానాయకుల జాబితాలో చేరే అవకాశాలున్నాయి.

ఇదీ చూడండి: యాంకర్​ విష్ణుప్రియ హాట్​ హాట్​ పోజులు.. అదిరిపోయాయిగా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.