Chandramukhi 2 First Look : కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న చిత్రం 'చంద్రముఖి -2'. అయితే చిత్రబృందం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేసింది. ఈ పోస్టర్లో హీరో లారెన్స్.. వెట్టయాన్ రాజా గెటప్‌లో కనిపిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్.. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
-
Back with double the swag and attitude! 😉 Witness Vettaiyan Raja's 👑 intimidating presence in @offl_Lawrence 's powerful first look from Chandramukhi-2 🗝️
— Lyca Productions (@LycaProductions) July 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Releasing this GANESH CHATURTHI in Tamil, Hindi, Telugu, Malayalam & Kannada! 🤗#Chandramukhi2 🗝️
🎬 #PVasu
🌟… pic.twitter.com/nf7BHwi3x6
">Back with double the swag and attitude! 😉 Witness Vettaiyan Raja's 👑 intimidating presence in @offl_Lawrence 's powerful first look from Chandramukhi-2 🗝️
— Lyca Productions (@LycaProductions) July 31, 2023
Releasing this GANESH CHATURTHI in Tamil, Hindi, Telugu, Malayalam & Kannada! 🤗#Chandramukhi2 🗝️
🎬 #PVasu
🌟… pic.twitter.com/nf7BHwi3x6Back with double the swag and attitude! 😉 Witness Vettaiyan Raja's 👑 intimidating presence in @offl_Lawrence 's powerful first look from Chandramukhi-2 🗝️
— Lyca Productions (@LycaProductions) July 31, 2023
Releasing this GANESH CHATURTHI in Tamil, Hindi, Telugu, Malayalam & Kannada! 🤗#Chandramukhi2 🗝️
🎬 #PVasu
🌟… pic.twitter.com/nf7BHwi3x6
ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వడివేలు, జ్యోతిక, రాధికా శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 19న 'చంద్రముఖి-2'.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'చంద్రముఖి' సినిమా 2005లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించగా.. జ్యోతిక ప్రధాన పాత్రలో మెప్పించారు. అయితే 'చంద్రముఖి' సినిమాకు సీక్వెల్‌గా.. 'చంద్రముఖి -2' సినిమా రాబోతుంది. కాగా రెండు సినిమాలకు పి. వాసుయే దర్శకత్వం వహించారు. కాగా చంద్రముఖి సినిమా థియేటర్లలో ఆడియెన్స్‌ను నవ్విస్తూనే.. చాలా భయపెట్టింది. మరి లేటెస్ట్ 'చంద్రముఖి -2' ఎలా ఉండనుందో అని అభిమానులు ఆత్రుతగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే 'చంద్రముఖి-2' షూటింగ్ పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయని తెలుస్తోంది.
Lawrence Directed Movies : మొదటగా కొరియోగ్రాఫర్‌గా టాలీవుడ్‌కు పరిచయమై.. ఆ తర్వాత డైరెక్టర్, హీరోగా మారారు రాఘవ లారెన్స్. తెలుగులో కింగ్ నాగార్జున హీరోగా 'మాస్' సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత ముని, స్టైల్, డాన్, కాంచన సినిమాలతో మెరిశారు. కాగా పాన్ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన 'రెబల్' సినిమా.. భారీ అంచనాల నడుమ విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
Lawrence Horror Movies : నటుడు రాఘవ లారెన్స్.. మొదటి నుంచే హర్రర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. గతంలో లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'ముని' తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయం సాధించింది. తర్వాత 'కాంచన' సినిమాతో ఓవైపు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే.. మరోవైపు భయపెట్టారు. ఆ తర్వాత ఇదే జోనర్లో కాంచన- 2, కాంచన-3, గంగా, శివలింగ సినిమాలతో సక్సెస్ అయ్యారు.