ETV Bharat / entertainment

''బ్రో' మూవీకి పవన్ రెమ్యునరేషన్.. ప్రపంచంలో ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు'

author img

By

Published : Aug 2, 2023, 12:43 PM IST

BRO Movie Pavan Kalyan Remuneration : పవర్​ స్టార్​ పవన్ కల్యాణ్, సాయి ధరమ్​ తేజ్​ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'బ్రో'. తాజాగా ఆ సినిమా నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్.. బ్రో బడ్జెట్​తో పాటు పవన్​ కల్యాణ్​ రెమ్యునరేషన్​పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

pawan kalyan bro movie
bro movie

BRO Movie Pavan Kalyan Remuneration : పవర్ స్టార్ పవన్ కల్యాణ్​, సుప్రీమ్​ స్టార్​ సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'బ్రో'. తమిళ దర్శకుడు సముద్రఖని రూపొందించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. గత శుక్రవారం ఇండియాతో పాటు ఓవర్సీస్​లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద మంచి టాక్ అందుకుని దూసుకుపోతోంది.

పవన్ కల్యాణ్​ వింటేజ్ లుక్స్​తో పాటు వింటేజ్ పవన్ సినిమా పాటలతో సినిమా మొత్తం పవన్​ కంటెంట్​తో నిండిపోయింది. దీంతో థియేటర్​ అంతా ఈలలు గోలలతో సందడిగా మారింది. ఇక ఈ సినిమా విజయాన్ని అందుకోవడం వల్ల మూవీ యూనిట్​ పలు ప్రాంతాల్లో సక్సెస్​ మీట్స్​తో వేడుక చేసుకుంటోంది. మరోవైపు నిర్మాత టీజీ విశ్వప్రసాద్​ కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయిపోయారు. ఈ క్రమంలో ఆయన తాజగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పవన్ రెమ్యూనరేషన్​తో పాటు 'బ్రో' సినిమా బడ్జెట్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

BRO Movie Budget : 'బ్రో' మూవీ బడ్జెట్ సుమారు వంద కోట్లు అంట కదా అది ఇండియాలోదా..? లేక అమెరికా నుంచి తీసుకొచ్చారా..? అంటూ యాంకర్​ అడగ్గా.. "అది ఒకరికి అవసరం లేదు.. ఒకరికి అవసరం లేని సమాధానాన్ని నేను ఇవ్వదల్చుకోలేదు. ఈ సినిమాకు ఎంత బడ్జెటైందనే విషయం మాకు మాత్రమే తెలుసు. అది మాకు తప్ప ప్రపంచంలో ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు" అని ఆయన వెల్లడించారు.

BRO Movie Remuneration : పవన్ రెమ్యూనరేషన్ గురించి అడిగిన ప్రశ్నకు "అది మా కంపెనీకి, కల్యాణ్​కు ఉన్న ఒప్పందం.. ప్రపంచంలో ఎవరికీ అది అడిగే హక్కు లేదు. తన ఐటీ రిటర్న్స్​ ఫైలింగ్​ చేసేటప్పుడు ఆయన చేసుకుంటారు. మా ట్యాక్స్ ఫైలింగ్స్​ను మేము చేసుకుంటాం" అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆ మూడు సినిమాలు..
BRO Movie Record : 'బ్రో' సినిమాతో పవన్​ కల్యాణ్​ మరో రికార్డు సృష్టించారు. ఆయన నటించిన మూడు రీమేక్​ సినిమాలు వరసుగా కలెక్షన్లు రూ. 100 కోట్లు దాటాయి. ఇప్పటికే ఈ జాబితాలో 'వకీల్​ సాబ్'​, 'భీమ్లా నాయక్'​ ఉండగా.. ఇప్పుడు వంద కోట్ల క్లబ్​లోకి చేరి 'బ్రో' సినిమా కూడా సెన్సేషన్​ క్రియేట్​ చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.