ETV Bharat / entertainment

'బ్రహ్మాస్త్ర' మేకింగ్​ వీడియో విడుదల.. తెర వెనక కష్టమిదీ - బ్రహ్మాస్త్ర మేకింగ్ వీడియో

Brahmastra Movie : భారీ బడ్జెట్​తో తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. రణ్‌బీర్‌, అలియా భట్‌, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీరాయ్‌ కలిసి నటించిన ఈ సినిమా తొలి భాగం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అయాన్‌ ముఖర్జీ మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు.

Brahmastra Movie
Brahmastra Movie
author img

By

Published : Sep 4, 2022, 6:44 PM IST

Brahmastra Movie : ఇతిహాసాల ఆధారంగా భారీ తారాగణంతో మూడు భాగాలుగా రూపొందుతున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. రణ్‌బీర్‌, అలియా భట్‌, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీరాయ్‌ కలిసి నటించిన ఈ సినిమా తొలి భాగం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అయాన్‌ ముఖర్జీ మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ చిత్ర కథ కాగితంపై నుంచి తెరపైకి వచ్చే వరకూ సాగిన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి షాట్‌ను సవాలుగా స్వీకరించి, తెరకెక్కించినట్టు పేర్కొన్నారు.

అయాన్‌ తన డ్రీమ్‌ ప్రాజెక్టుగా చెప్పుకొనే ఈ సినిమా కోసం సుమారు 10 పదేళ్లు శ్రమించారు. నరాస్త్ర, నంది అస్త్ర, ప్రభాస్త్ర, జలాస్త్ర, పవనాస్త్ర, బ్రహ్మాస్త్రాల గురించి చెప్పే ఈ కథను తెరకెక్కించేందుకు ఓ దర్శకుడిగా ఆయనెంత కష్టపడ్డారో తాజాగా విడుదలైన వీడియో తెలియజేస్తుంది. బ్లూమ్యాట్‌ ఉపయోగించి యాక్షన్‌ సన్నివేశాలను ఎలా షూట్‌ చేశారో ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ సినిమాని 'బ్రహ్మాస్త్రం: శివ' పేరుతో తెలుగులో దర్శకుడు రాజమౌళి సమర్పిస్తున్నాడు.

ఇవీ చదవండి: దేవిశ్రీ ప్రసాద్​తో వివాహంపై క్లారిటీ ఇచ్చిన ఆ నటి

'11ఏళ్లకే రణ్​బీర్​కు పడిపోయా.. పెళ్లి ఫిక్స్ అవ్వగానే పిల్లల గురించి ఆలోచించా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.