సౌత్ ఇండస్ట్రీ సినిమాల వైపు బాలీవుడ్ యాక్టర్స్ ఇంట్రెస్ట్ చూపుతున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే మన సినిమాలు పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు తారలు కూడా ఇక్కడి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసి ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఓ హిందీ సినీయర్ హీరో కొడుకు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతనే బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి.
'నేనెక్కడున్నా' అనే చిత్రంతో అతడు తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. ఈ చిత్రంతో మాధవన్ కోదాడ డైరెక్టర్‌గా పరిచయం కానున్నారు. ఇందులో ఎయిర్టెల్ ఫేమ్ సశా ఛెత్రి హీరోయిన్గా మిమో చక్రవర్తి సరసన నటించింది. కె.బి.ఆర్ సమర్పణలో మారుతి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు.. ఈ చిత్ర టైటిల్ టీజర్ పోస్టర్‌ను లాంఛనంగా విడుదల చేశారు.
అనంతరం సురేశ్ బాబు మాట్లాడుతూ.. "టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. స్టోరీ బాగుంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు, కొత్త ప్రయత్నాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. సినిమా విజయం సాధించాలని ఆశిస్తున్నాను. దర్శకనిర్మాతలకు ఆల్ ది బెస్ట్ విషెస్" అని చెప్పారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నిర్మాత మారుతి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. "సినిమా షూటింగ్ పూర్తైంది. ముంబయి, హైదరాబాద్, బెంగళూరులో చిత్రీకరణ చేశాం. తొలి కాపీ సిద్ధమైంది. ప్రస్తుతం సెన్సార్ పనుల్లో ఉంది. కథ, సంగీతం, విజువల్స్, డైరెక్షన్ మా సినిమాకు బలం. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వంలో రష్యన్ డాన్సర్లతో చేసిన పబ్ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. సెన్సార్ కంప్లీట్ అయ్యాక విడుదల తేదీ వివరాలు వెల్లడిస్తాం. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం" అని తెలిపారు.
"జర్నలిజం, రాజకీయం నేపథ్యంలో వస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఊహించని ట్విస్ట్‌లతో సినిమా నడుస్తుంది. ఈ చిత్రంతో హిందీ హీరో మిథున్ చక్రవర్తి తనయుడు మిమో చక్రవర్తిని టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం" అని డైరెక్టర్ మాధవన్ కోదాడ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: RRR హవా.. చరణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్.. బ్రదర్ ఎన్టీఆర్ అంటూ..