Bigg Boss 4th Week Elimination Vote : బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా ఆసక్తిగా కొనసాగుతోంది. మొదటి వారం కాస్త అటు ఇటుగా అనిపించినప్పటికీ... రెండో వారం నుంచి షో రసవత్తరంగా సాగుతుపోతోంది. 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా.. ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయిపోయారు. వీరిలో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఉండగా.. ఇక నాలుగో వారం ఎపిసోడ్ మరో రోజులో పూర్తి కానున్న నేపథ్యంలో ఎవరు ఎలిమినేట్ కానున్నారా అనే ఆసక్తి మొదలైపోయింది. అయితే ఈ నాలుగో వారంలో ఎవరు ఎలిమినేట్ కానున్నారో తెలిసిపోయింది!
ప్రస్తుతం ఈ నాలుగో వారమంతా ఆసక్తిగా సాగుతున్న సంగతి తెలిసిందే. అందుకు కారణం రైతు బిడ్డగా చెప్పుకుని పల్లవి ప్రశాంత్ పవర్ అస్త్ర పోటీలో ఉండటం, హౌస్‌లోని సీరియస్ బ్యాచ్ అంతా ఆ రైతు బిడ్డపై పడిపోవడం. ముఖ్యంగా రతిక అయితే ప్రశాంత్‌పై దారుణంగా ప్రవర్తిస్తూ విరుచుకుపడుతోంది!
Pallavi Prasanth Ratika : మొదట లవ్ ట్రాక్ నడిపిన ఈ జంట.. ఆ తర్వాత శత్రువులుగా మారిపోయారు. ఆ మధ్య కాస్త కలిసినట్టుగా కనిపించినా.. నాలుగో వారం నామినేషన్స్‌లో వీళ్ల పంచాయితీ ఎక్కువైపోయింది. పైగా ఈ షో మొదటి నుంచే తన ఎక్స్‌బాయ్ ఫ్రెండ్ సింగర్ రాహులు సిప్లిగంజ్ గురించి కూడా మాట్లాడింది. దీంతో అతడు కూడా సోషల్ మీడియాలో ఆమెపై పరోక్షంగా సుదీర్ఘ పోస్ట్ కూడా పెట్టారు. ఇలా ప్రతీ విషయం ఆమెపై బాగా ప్రభావం చూపాయి. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ ఎక్కువైపోయింది. మరీ దారుణంగా ఆమెను తిడుతున్నారు! అంతా ఆమెనే టార్గెట్ చేశారు.
BigBoss Rathika Rose Eliminate : ఈ క్రమంలోనే రతికను సీక్రెట్ హౌజ్‌కు పంపడం లేదా ఎలిమినేట్ చేసే అవకాశముందని తెలిసింది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చూడాలి మరి బిగ్ బాస్.. ఆమెను ఎలిమినేట్ చేస్తారా..లేదా సీక్రెట్ హౌజ్‌కు పంపిస్తారా అనేది..