Chiranjeevi Allu Aravind Movie : మెగాస్టార్ చిరంజీవి - అల్లు అరవింద్ మధ్య బంధం గురించి తెలిసిందే. అయితే ఈ రెండు ఫ్యామీలల మధ్య మనస్పర్థలు ఉన్నాయని ఎన్ని సార్లు ప్రచారాలు సాగినా వాటికి తమ చర్యలతో సరైన సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. అయితే రీసెంట్గా అల్లు అరవింద్.. చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా ఓ స్టేజ్‌పై మాట్లాడుతూ.. చిరు చేసే సామాజిక సేవా కార్యక్రమాల గురించి ఒకరు తప్పుగా మాట్లాడిందుకు.. పన్నెండేళ్ల పాటు పోరాటం చేసి మరీ జైలుకు పంపించా అంటూ కామెంట్లు కూడా చేశారు. ఫ్యాన్స్ మెగాస్టార్ సినిమాలు చూస్తూ పెరిగితే.. తాను ఆయనతో సినిమాలు చేస్తూ పెరిగాను అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు.
అయితే ఇప్పుడా ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అభిమానులు అల్లు అరవింద్.. చిరుకు అండగా నిలవాల్సిన అవసరమొచ్చిందని అంటున్నారు. తన అనుభవాన్ని ఉపయోగించి చిరుకు సూపర్ హిట్ అందివ్వాలని కోరుతున్నారు. ఎందుకంటే చిరు రీఎంట్రీలో ఆయన రేంజ్‌కు తగ్గ హిట్లను అందుకోలేకపోతున్నారు. కేవలం వాల్తేరు వీరయ్య ఒక్కటే భారీ హిట్‌ను అందుకుంది. తాజాగా వచ్చిన భోళాశంకర్.. ఆచార్య సినిమా రేంజ్లో భారీ డిజాస్టర్‌ను అందుకుంది.
దీంతో చాలామంది.. అల్లు అరవింద్-చిరు కలిసి సినిమా చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే.. వీరిద్దరు కలిసి ఓ సినిమా చేసి ఎన్నో ఏళ్ళు అయిపోయాయి. చివరిగా 2005లో 'అందరివాడు' సినిమా చేశారు. ఆ తర్వాత కొంత కాలం ఆగి చిరు రాజకీయాల్లోకి వెళ్లిపోవడం, అరవింద్ ఇతర సినిమాలతో బిజీ అయిపోయారు. ఇక చిరు రీఎంట్రీ ఇచ్చాక సొంత బ్యానర్‌పై సినిమాలు చేస్తూ లేదంటే ఇతర నిర్మాణ సంస్థల్లో మూవీస్ చేస్తూ ముందుకెళ్తున్నారు.
ఇన్నేళ్ల కాలంలో వీరిద్దరు కలిసి పనిచేయలేదు! కనీసం భవిష్యత్‌లో కలిసి సినిమా చేసే విధంగా కూడా ఎటువంటి హింట్లు కూడా ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అల్లు అరవింద్.. స్టోరీస్‌ను జడ్జ్ చేయడంలో, పైగా చిరంజీవి ఎలాంటి కథలు సెట్ అవుతాయో చెప్పడంలో దిట్ట అని అభిప్రాయపడుతున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, మాస్టర్.. ఎన్నో చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయని గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చిరంజీవికి అల్లుఅరవింద్ అండ, అనుభవం అవసరమంటూ అభిప్రాయాలు కాస్త ఎక్కువగా వినపడుతున్నాయి. కానీ వాదనలు విపడుతున్న ఈజీకా ఇది ఇప్పట్లో కాకపోచ్చు. ఎందుకంటే చిరు ఇప్పటికే ఓ మూడు నిర్మాణ సంస్థలతో సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారని తెలిసింది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Bhola Shankar Collection Day 2 : ఇక భోళా శంకర్ కలెక్షన్ల వివరాల విషయానికొస్తే.. మొదటి రోజు (ఆగస్టు 11) తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.20కోట్ల గ్రాస్ అందుకున్న ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ.33కోట్లు సాధించిందని మూవీటీమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. అయితే రెండో రోజు(ఆగస్టు 12) భోళా శంకర్ సినిమా వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోయినట్టు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. రెండో రోజు కేవలం రూ.7కోట్ల వరకు మాత్రమే కలెక్ట్ అయినట్లు వెల్లడించాయి. అంటే మొదటి రోజుతో పోలిస్తే దాదాపు 50శాతానికిపైగా డ్రాప్ అయినట్లు తెలుస్తోంది.