Bhagavanth Kesari Kajal First Look : నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం 'భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ విడుదల చేసింది చిత్ర యూనిట్. కాజల్ పుట్టినరోజు సందర్భంగా.. ఆమె ఫస్ట్ లుక్‌ను రీలీజ్ చేశారు మేకర్స్. ఈ తాజా పోస్టర్లో కాజల్.. ఫోన్ మాట్లాడుతూ.. బుక్ చదువుతూ క్యూట్ లుక్‌లో కనిపించింది. తన నవ్వులతో కుర్రకారుకు కిర్రెక్కిస్తోంది. అయితే, బాలయ్య-కాజల్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం.
-
Team #BhagavanthKesari wishes the ever-charming @MsKajalAggarwal a very Happy Birthday ❤️
— Shine Screens (@Shine_Screens) June 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
May your magnetic presence captivate the audience on the big screens 💥#HappyBirthdayKajal 💫#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @rampalarjun @MusicThaman @jungleemusicSTH pic.twitter.com/H0wOwmLpeZ
">Team #BhagavanthKesari wishes the ever-charming @MsKajalAggarwal a very Happy Birthday ❤️
— Shine Screens (@Shine_Screens) June 19, 2023
May your magnetic presence captivate the audience on the big screens 💥#HappyBirthdayKajal 💫#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @rampalarjun @MusicThaman @jungleemusicSTH pic.twitter.com/H0wOwmLpeZTeam #BhagavanthKesari wishes the ever-charming @MsKajalAggarwal a very Happy Birthday ❤️
— Shine Screens (@Shine_Screens) June 19, 2023
May your magnetic presence captivate the audience on the big screens 💥#HappyBirthdayKajal 💫#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @rampalarjun @MusicThaman @jungleemusicSTH pic.twitter.com/H0wOwmLpeZ
Bhagavath Kesari Balakrishna : అడవి బిడ్డ.. నేలకొండ 'భగవంత్ కేసరి'గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు మాస్ హీరో బాలకృష్ణ. ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దసరాకు సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే చిత్రీకరణను పరుగులు పెట్టిస్తోంది చిత్ర బృందం. అందులో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో మరో కొత్త షెడ్యూల్ ప్రారంభించారు. మాస్ యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీలో కాజల్ సహా శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సి. రామ్ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.
అందాల బాపుబొమ్మ కాదు.. ఈ 'సత్యభామ'!
Satyabhama Movie Kajal Aggarwal : మరోవైపు, అందాలు ముద్దుగుమ్మ కాజల్ కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఈసారి పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా అలరించేందుకు సిద్ధమయ్యింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'సత్యభామ'. అఖిల్ డేగల దర్శకత్వం వహిస్తున్నారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. 'మేజర్' దర్శకుడు శశికిరణ్ తిక్క స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. కాజల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేసిన చిత్ర యూనిట్.. ఓ గ్లింప్స్‌ను కూడా విడుదల చేసింది. అందులో పవర్‌ఫుల్ పంచ్‌లతో ఖైదీలను చితక్కొట్టింది కాజల్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
NBK 109 Movie : మరోవైపు, మెగాస్టార్ నటించిన 'వాల్తేరు వీరయ్య'తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాలకృష్ణ. 'NBK 109' వర్కింగ్ టైటిల్‌తో సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ అండ్ శ్రీకర స్టుడియోస్ బ్యానర్లపై.. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా.. కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
-
On this special day, Delighted to share the collaboration with the Charismatic 'Natasimham' #NandamuriBalakrishna garu for #NBK109 🦁😍
— Bobby (@dirbobby) June 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The auspicious Pooja ceremony took place today, marking the beginning of an incredible cinematic adventure. 🔥
𝑽𝑰𝑶𝑳𝑬𝑵𝑪𝑬 𝒌𝒂… pic.twitter.com/tUeSHH6uDE
">On this special day, Delighted to share the collaboration with the Charismatic 'Natasimham' #NandamuriBalakrishna garu for #NBK109 🦁😍
— Bobby (@dirbobby) June 10, 2023
The auspicious Pooja ceremony took place today, marking the beginning of an incredible cinematic adventure. 🔥
𝑽𝑰𝑶𝑳𝑬𝑵𝑪𝑬 𝒌𝒂… pic.twitter.com/tUeSHH6uDEOn this special day, Delighted to share the collaboration with the Charismatic 'Natasimham' #NandamuriBalakrishna garu for #NBK109 🦁😍
— Bobby (@dirbobby) June 10, 2023
The auspicious Pooja ceremony took place today, marking the beginning of an incredible cinematic adventure. 🔥
𝑽𝑰𝑶𝑳𝑬𝑵𝑪𝑬 𝒌𝒂… pic.twitter.com/tUeSHH6uDE