Baby OTT Release : సాయి రాజేశ్ దర్శకత్వంలో వచ్చిన బేబీ మూవీ.. థియేటర్లలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే. జులై 14న తేదీన విడుదలైన ఈ సినిమా.. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నాలుగు వారాల పాటు థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్లో వసూళ్లను అందుకుంది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ ఈ చిత్రాన్ని దాదాపూ రూ.5 నుంచి 10 కోట్ల(అంచనా) రూపాయాలతో తెరెకెక్కించారు. అయితే ఈ చిత్రం ఏకంగా రూ.75కోట్లకు పైగా కలెక్షన్లను అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ హిట్ స్టేటస్‌ను అందుకుంది. యూత్ ఆడియెన్స్ అయితే ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయిపోయారు. సినిమాను ఒకటి కన్నా ఎక్కువ చూసేందుకు ఆసక్తి చూపారు. ఇక ఓటీటీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.
Baby OTT Release Telugu : ఈ క్రమంలోనే మూవీటీమ్.. ఆగస్టు 25 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రకటించింది. ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ ఉన్న వారికి 12 గంటల ముందే ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. ఇక వచ్చి రాగానే మళ్లీ థియేటర్ల ఊపును ఓటీటీలోనూ కొనసాగించి దుమ్మురేపుతోంది. ఈ సినిమా ఆహా ఓటీటీలో విడుదలైన 32 గంటలలోనే అత్యంత వేగంగా 100+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ పొందింది. ఈ విషయాన్ని ఆహా నిర్వాహకులు ప్రకటించారు. బేబీ సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ.. బేబీ సినిమా తీన్మార్ మ్రోగింది అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతూ ట్రెండ్ అవుతోంది.
ఇకపోతే ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ నటన చూస్తే యాక్టింగ్‌లో ఎంతో పరిణితి చెందాడనే అనిపిస్తుంది. భగ్న ప్రేమికుడిగా యూత్‌ను ఏడిపించేశాడు. ఆ తర్వాత వైష్ణవి నటన హైలెట్‌గా నిలిచింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ చిత్రం.. ప్రస్తుత సమాజంలో ఉన్న ప్రేమ కథలను, యూత్ ఆలోచనలను దర్శకుడు సాయిరాజేశ్ బాగా చూపించారు. ఫైనల్‌గా కంటెంట్, ఎమోషన్స్‌తో కథ బాగుంటే.. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని బేబీ సినిమా నిరూపించింది.
-
#BabyTheMovie emerges as a BLOCKBUSTER on OTT also, reaching a jaw-dropping 100 million views in just 32 hours on @ahavideoIN ! ❤️🔥#CultBlockbusterBaby is ruling the small screens, too! 🤩
— Geetha Arts (@GeethaArts) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Watch the heart-warming love story at your homes now! ❤️ pic.twitter.com/UEBoZaBAyA
">#BabyTheMovie emerges as a BLOCKBUSTER on OTT also, reaching a jaw-dropping 100 million views in just 32 hours on @ahavideoIN ! ❤️🔥#CultBlockbusterBaby is ruling the small screens, too! 🤩
— Geetha Arts (@GeethaArts) August 26, 2023
Watch the heart-warming love story at your homes now! ❤️ pic.twitter.com/UEBoZaBAyA#BabyTheMovie emerges as a BLOCKBUSTER on OTT also, reaching a jaw-dropping 100 million views in just 32 hours on @ahavideoIN ! ❤️🔥#CultBlockbusterBaby is ruling the small screens, too! 🤩
— Geetha Arts (@GeethaArts) August 26, 2023
Watch the heart-warming love story at your homes now! ❤️ pic.twitter.com/UEBoZaBAyA