ETV Bharat / entertainment

బేబీ ఆలియా భట్​ను చూశారా?.. వావ్‌ ఎంత క్యూట్‌గా ఉందో! - ఆలియా భట్​ వైరల్​ వీడియో

బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్​కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో బేబీగా ఉన్న ఆలియా పింక్ డ్రెస్‌లో చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. ఆ వీడియో మీరూ చూసేయండి.

baby alia bhat childhood video viral
baby alia bhat childhood video viral
author img

By

Published : Nov 14, 2022, 8:25 PM IST

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ పరిచయం అక్కర్లేని పేరు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాల్లో నటించింది. ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ. దీంతో ఆలియా కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.

తాజాగా ఆలియా భట్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వీడియోలో ఆమెకు ఏడాది వయసులో తన తండ్రి మహేశ్ భట్‌పై ఆడుకుంటూ కనిపించింది. బాలీవుడ్ స్టార్ నటి త్రోబ్యాక్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్​చల్ చేస్తోంది. ఆ వీడియోలో బేబీగా ఉన్న ఆలియా పింక్ డ్రెస్‌లో చాలా క్యూట్‌గా కనిపిస్తోంది.

బాలల దినోత్సవం సందర్భంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె తండ్రి మహేష్ భట్ ఫోన్‌లో మాట్లాడుతూ..'డార్లింగ్ అలియా'కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని పాట పాడుతూ కనిపించారు. అయితే వాస్తవానికి ఆలియా ఈ వీడియోను ఆమె 25వ పుట్టినరోజున అభిమానులతో పంచుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.