ETV Bharat / entertainment

Atiya Shetty KL Rahul : భర్త సెంచరీపై అతియా ఎమోషనల్​ పోస్ట్.. అతనే నెంబర్​ వన్ అంటూ.. - విరాట్​ కోహ్లి సెంచరీ

Atiya Shetty KL Rahul : ఆసియా కప్ సూపర్​ 4 మ్యాచ్​లో పాకిస్థాన్​ను చిత్తు చేసిన రోహిత్​ సేనపై సర్వత్ర ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్​లో శతకొట్టిన కెఎల్​ రాహుల్​, విరాట్​ కోహ్లిలను ఫ్యాన్స్​ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలో రాహుల్​ భార్య అతియా, విరాట్ భార్య అనుష్క కూడా తమ భర్తలను కొనియాడారు. ఇంతకీ వారేమన్నారంటే?

Atiya Shetty KL Rahul
Atiya Shetty KL Rahul
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 10:08 AM IST

Updated : Sep 12, 2023, 11:58 AM IST

Atiya Shetty KL Rahul : ఆసియా కప్ సూపర్​ 4 మ్యాచ్​లో పాకిస్థాన్​ను చిత్తు చేసిన రోహిత్​ సేన ఇప్పుడు అందరి ప్రశంసలు పొందుతూ దూసుకెళ్తోంది. ఎక్కడ చూసిన మన భారత ప్లేయర్లు ఆడిన తీరు గురించే చర్చలు కొనసాగుతున్నాయి. అభిమానుల నుంచి మాజీల వరకూ అందరూ మన ప్లేయర్లను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా కేఎల్​ రాహుల్​, విరాట్ కోహ్లి లాంటి పరుగుల వీరులను నెట్టింట అభిమానులు కొనియాడుతున్నారు. గాయం నుంచి కోలుకున్న కేఎల్​ రాహుల్​ పాకిస్థాన్‌తో సూపర్‌-4 మ్యాచ్‌లో సూపర్‌ ఇన్నింగ్స్‌తో తన ఆటతీరుపై అందరికీ ఉన్న అనుమానాలకు ఫుల్​ స్టాప్​ పెట్టాడు. బలమైన పాక్‌ బౌలర్లను ఎదుర్కొంటూ సుదీర్ఘ సమయం ఏ తడబాటూ లేకుండా బ్యాటింగ్‌ చేయడమే కాక.. చక్కటి స్ట్రోక్‌ప్లేతో మెప్పించాడు. దీంతో బాలీవుడ్ నటి అతియా శెట్టి తన భర్త కేఎల్ రాహుల్‌ను అభినందిస్తూ ఇన్​స్టాగ్రామ్​లో ఓ ఎమోషనల్​ పోస్ట్​ షేర్​ చేసింది.

" చీకటి కూడా రాత్రి వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అది క్రమ క్రమంగా ముగుస్తుంది. అలాగే సూర్యుడు తప్పకుండా మళ్లీ ఉదయిస్తాడు. మీరే నాకు సర్వస్వం, నేను మిమల్ని ఆరాధిస్తాను. (#1).' అని ఆమె పోస్ట్‌ చేసింది. దీంతో రాహుల్ ఫ్యాన్స్​ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు.

Anushka Sharma Asia Cup : మరోవైపు ఇదే మ్యాచ్​లో సెంచరీ సాధించిన రన్నింగ్ మెషిన్​ విరాట్​ కోహ్లిపై తన సతీమణి అనుష్క శర్మ కూడా ప్రశంసల జల్లును కురిపించింది. తన ఇన్​స్టా స్టోరీలో విరాట్​ సెంచరీ చేసిన ఫొటోను షేర్​ చేసింది. సూపర్ ఇన్నింగ్స్ ఆడావు.. సూపర్ గయ్.. అంటూ తన భర్తను కొనియాడింది. ప్రస్తుతం ఈ రెండు పోస్ట్​లు నెట్టింట తెగ వైరల్​ అవుతున్నాయి.

Anushka Sharma Insta Post
అనుష్క శర్మ ఇన్​స్టా పోస్ట్

KL Rahul Asia Cup 2023 : తన ఆట తీరుతో ఆకట్టుకున్న కెఎల్ రాహుల్​.. మైదానంలో పాక్ ఆటగాళ్ల పట్ల తన ప్రవర్తనతోనూ అభిమానుల మనసును గెలుచుకున్నాడు. రవీంద్ర జడేజా వేసిన బంతి బౌన్స్‌ అయి పాకిస్థాన్‌ బ్యాటర్‌ అఘా సల్మాన్‌ ముఖం మీద తాకింది. దీంతో అతడి కంటి కింద గాయమై రక్తం కారింది. ఇ గమనించిన రాహుల్ అఘా వద్దకు వచ్చి పరామర్శించాడు. వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చేలా చేశాడు. ఇలా అఘా పట్ల ప్రవర్తించిన తీరును చూసిన నెటిజన్లు రాహుల్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Virat Kohli Favourite Cricketer : విరాట్ కోహ్లీ ఫేవరెట్ క్రికెటర్​ సచిన్​ కాదట! ఎవరో తెలిస్తే షాక్​ అవుతారు..

Asia Cup 2023 IND VS PAK : కోహ్లీ-కేఎల్ రాహుల్ సెంచరీ.. పాకిస్థాన్ ముందు భారీ లక్ష్యం..

Last Updated : Sep 12, 2023, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.