ETV Bharat / entertainment

Ashok Selvan Marriage Photos : ప్రియురాలితో ఏడడుగులేసిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' స్టార్​.. ఇంతకీ ఆమె ఎవరంటే? - అశోక్​ సెల్వన్​ భార్య

Ashok Selvan Marriage Photos : కోలీవుడ్​తో పాటు టాలీవుడ్​ ప్రేక్షకులను అలరించిన హీరో అశోక్ సెల్వన్‌ ఓ ఇంటివాడయ్యాడు. అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో తన ప్రేయసి నటి కీర్తి పాండియన్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలను షేర్​ చేశారు. వాటిని మీరు కూడా ఓ సారి చూసేయండి..

Ashok Selvan Marriage Photos
Ashok Selvan Marriage Photos
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 1:23 PM IST

Ashok Selvan Marriage Photos : కోలీవుడ్ హీరో అశోక్ సెల్వన్‌ ఓ ఇంటివాడయ్యాడు. బుధవారం ఉదయం తన ప్రియురాలు, నటి కీర్తి పాండియన్‌ మెడలో మూడుముళ్లు వేసి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ హీరో. తమిళనాడులోని ఓ ఆలయంలో ఈ వివాహం జరిగింది. పెళ్లికి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా ఈ ఫొటోలను అశోక్‌ సెల్వన్‌ తన ఫ్యాన్స్ కోసం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఈ కొత్త జంటకు విషెస్​ చెబుతున్నారు.

తమిళంలో మంచి గుర్తింపు ఉన్న ఈ స్టార్​ హీరో తెలుగులో పలు సినిమాల్లో కనిపించి అలరించారు. 'నిన్నిలా నిన్నిలా' అనే తెలుగు సినిమాతో టాలీవుడ్​ ప్రేక్షకులను పలకరించారు. ఆ తర్వాత విశ్వక్‌ సేన్ హీరోగా వచ్చిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాలోనూ అశోక్ సెల్వన్‌ కనిపించారు. ఇక విశ్వక్​ నటించిన ఓరి దేవుడా సినిమా ఒరిజినల్​ వెర్షన్​లో హీరో ఈయనే. 'పిజ్జా 2', 'భద్రమ్‌' లాంటి డబ్బింగ్‌ సినిమాల్లోనూ అశోక్​ సెల్వన్​ కనిపించారు. ఇటీవలే 'పోర్‌ తొళిల్‌' అనే థ్రిల్లర్‌ సినిమాతో ఓ సూపర్‌ హిట్​ను తన ఖాతాలోకి వేసుకున్నారు.

Ashok Selvan Wife Keerthi Pandian : ఇక కీర్తి పాండియన్‌ తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌1లో కంటెస్టెంట్​గా కనిపించి సందడి చేశారు. అంతే కాకుండా ఈమె కోలీవుడ్​ నటి రమ్య పాండియన్​కు కజిన్​ అవుతారట. దీంతో రమ్య కూడా తన చెల్లెలికి ఇన్​స్టా వేదికగా కంగ్రాజ్యూలేషన్స్​ చెప్పారు.'ప్రియమైన కన్మనికి హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌.. ప్రియాతి ప్రియమైన అల్లుడు.. మా కుటుంబంలోకి స్వాగతం' అని రమ్య కొత్త దంపతుల గురించి రాసుకొచ్చారు.

Ashok Selvan Keerthi Pandian Movie : మరోవైపు అశోక్ సెల్వన్‌, కీర్తి పాండియన్‌ కలిసి 'బ్లూ స్టార్‌' అనే తమిళ సినిమాలో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీదిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. కాగా అశోక్‌, కీర్తి పాండియన్‌ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ నెట్టింట పలు వార్తలు ట్రెండ్ అయ్యాయి. అయితే ఈ జంట ఎప్పుడూ అఫీషియల్​గా అనౌన్స్​ చేయలేదు.

Varun Tej Lavanya Engagement ఫొటోస్​ షేర్​ చేసిన చిరంజీవి.. మీరు చూశారా?

ట్రైలర్: స్నేహితురాలే భార్య అయితే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.