ETV Bharat / entertainment

బాలయ్య NBK 108లో విలన్​గా బాలీవుడ్ యాక్టర్​ - ఎన్​బీకే 108లో బాలీవుడ్ యాక్టర్​

నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రం NBK 108లో బాలీవుడ్​ యాక్టర్​ నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది మూవీటీమ్​. ఓ స్పెషల్​ వీడియోను పోస్ట్ చేసింది.

Arjun Rampal in NBK 108
బాలయ్య NBK 108లో విలన్​గా బాలీవుడ్ యాక్టర్​
author img

By

Published : May 10, 2023, 12:22 PM IST

Updated : May 10, 2023, 12:42 PM IST

అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో బ్యాక్​ టు బ్యాక్​ సక్సెస్​లను అందుకుని ఫుల్​ జోష్​ మీదున్నారు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన నటిస్తున్న కొత్త చిత్రం NBK 108. యంగ్ అండ్ ఫన్​ డైరెక్టర్​ అనిల్​ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాతో హ్యాట్రిక్​ హిట్​ కొట్టాలని బాలయ్యతో పాటు ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. అయితే మూవీటీమ్​.. సినిమాకు సంబంధించి ఓ కొత్త అప్డేట్ ఇచ్చింది. బాలీవుడ్​​ యాక్టర్​ అర్జున్ రాంపాల్​ సినిమాలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఓ ప్రత్యేక వీడియోను కూడా పోస్ట్ చేసింది. 'జాతీయ పురస్కార గ్రహీత, టాలెంటెడ్​ ఆర్టిస్ట్ అర్జున్ రాంపాల్​కు వెల్కమ్! తెలుగులో విలన్​గా అరంగేట్రం చేయనున్నారు' అని చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్​ పేర్కొంది. ఇందులో డైరెక్టర్​ అనిల్ రావిపూడి-అర్జున్​ రాంపాల్​ కలిసి ముచ్చటిస్తూ కనిపించారు.

అర్జున్ రాంపాల్ నోట బాలయ్య డైలాగ్.. 'ఫ్లూట్ జింక ముందు ఊదు. సింహం ముందు కాదు'.. బాలకృష్ణ డైలాగ్​ను.. ఈ వీడియోలో అర్జున్ రాంపాల్ చెప్పడం విశేషం. అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమాలో మంచి డైలాగులు ఉన్నాయని అర్జున్​ తెలిపారు. సినిమాలో అవకాశం ఇచ్చినందుకు బాలయ్యకు థాంక్స్ అంటూ నమస్కారం పెట్టారు.

ఇకపోతే NBK 108 సినిమా విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయని సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 36 కోట్లకు కొనుగోలు చేసిందట. ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. ఆమె బాలకృష్ణ కుమార్తెగా కనిపించనుందని మొదట్లో ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత శ్రీలీలకు బాబాయ్​గా బాలయ్య కనిపించనున్నారని అన్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాల్సి ఉంది. సీనియర్ యాక్టర్​ శరత్ కుమార్ బాలయ్య సోదరుడిగా కనిపించనున్నారు.​ ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

బాలయ్య జోడీగా కాజల్​.. బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న తొలి చిత్రమిది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'లక్ష్మీ కళ్యాణం'తో కాజల్ హీరోయిన్​గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్​తో 'బృందావనం', 'టెంపర్' సినిమాల్లో నటించారు. ఇప్పుడు బాలయ్యతో కలిసి సినిమా చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: అందాల శ్రీముఖి లగ్జరీ లైఫ్​.. కారు, బంగ్లా, ఫ్యాషన్​ సెన్స్​ వేరే లెవల్​!

Last Updated : May 10, 2023, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.