ETV Bharat / entertainment

Anushka Shetty Marriage News : పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన అనుష్క.. అప్పుడే చేసుకుంటుందట - anushka shetty marriage life

Anushka Shetty Marriage News : నవీన్‌ పొలిశెట్టి-అనుష్క నటించిన తాజా చిత్రం 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'. తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లో అనుష్క మాట్లాడుతూ తన పెళ్లి గురించి మాట్లాడింది.

Anushka Shetty Marriage News : పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన అనుష్క.. అప్పుడే చేసుకుంటానంటూ..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 6:37 PM IST

Anushka Shetty Marriage News : దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క శెట్టి నటించిన చిత్రం 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'. పి.మహేష్‌బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో సెప్టెంబర్‌ 7న రిలీజ్ అవ్వనుంది(miss shetty mr polishetty release date). దీంతో కొద్ది రోజులుగా హీరో నవీన్ పొలిశెట్టి ప్రమోషన్స్​ పనిలో బిజీగా ఉండగా.. ఇప్పుడు హీరోయిన్​ అనుష్క కూడా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ చిత్ర విశేషాలతో పాటు తన పెళ్లి గురించి కూడా ఆసక్తికర విషయాలను తెలిపింది.

"ఈ చిత్రంలో నా పాత్ర పేరు అన్విత. అందరు అమ్మాయిలా కాకుండా.. ఎంతో ప్రత్యేకం. తన పనులు పూర్తి చేయడం కోసం ఏదైనా చేస్తుంది. మంచి కథల్లో నటించడం ఎంతో సవాల్​తో కూడుకున్న పని. నా కెరీర్‌లో దేవసేన, జేజమ్మ, భాగమతి లాంటి ఎన్నో స్పెషల్ రోల్స్ చేశాను. ఇప్పుడు అన్విత పాత్ర కూడా అలాంటిదే. ఎంతో భిన్నంగా ఉంటుంది. ఇలాంటి పాత్రలు పోషించడానికి అదృష్టం ఉండాలి. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో యాక్టింగ్​పై ఎలాంటి అవగాహన లేదు. ఇప్పుడీ స్థాయికి చేరుకున్నానంటే.. దీని వెనక ఎంతో మంది ప్రోత్సాహం ఉంది. ఎన్ని సినిమాలు చేసినా.. మొదటి రోజు సెట్‌కు ఎలా వెళ్లానో ఇప్పుడూ అలానే వెళ్తుంటాను. ఇన్నేళ్ల నా జర్నీలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నాను. ఒక్కోసారి ఎంతో బాగుంటుంది. కానీ ఇంకోసారి ఎంతో కఠినంగా అనిపిస్తుంటుంది. ఆడియెన్స్​ను ఎప్పుడూ గుర్తుండిపోయే పాత్రలు చేయాలని అనుకుంటుంటాను. " అని అనుష్క చెప్పింది.

Anushka Shetty Marriage Status : తన పెళ్లిపై కూడా అనుష్క మాట్లాడింది. "వివాహ వ్యవస్థపై నాకు నమ్మకముంది. పెళ్లికి నేనెప్పుడూ వ్యతిరేకం కాదు. సమయం వచ్చినప్పుడు వివాహం చేసుకుంటాను" అని చెప్పింది. సినిమాల కోసం శరీరాకృతిలో మార్పు తీసుకురావడంపై కూడా అనుష్క మాట్లాడింది(Anushka shetty weight). "మంచి స్క్రిప్ట్‌ దొరికితే దాని కోసం ఎంత సాహసమైనా చేయాలనిపిస్తుంది. ఒక్కోసారి బరువు పెరగడం, తగ్గడం యాక్టర్స్​కు ఎంతో సవాలుతో కూడుకున్న విషయం" అని ఆమె చెప్పింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Miss Shetty Mr Polishetty Review : సినిమాపై మెగాస్టార్​ చిరంజీవి ట్విట్టర్​ రివ్యూ.. ఏమని పోస్ట్ చేశారంటే?

Anushka Naveen Polishetty : నవీన్​ పొలిశెట్టికి అనుష్క ప్రాంక్ కాల్​.. ఓ రేంజ్​లో ఆటాడేసుకుందిగా!.. మీరు విన్నారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.