Anushka Shetty Birthday Photos : 2005లో విడుదలైన 'సూపర్' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. వైవిధ్యమైన పాత్రలతో నటిగా తిరుగులేని పేరు సంపాదించుకుంది. అలా సినీ పరిశ్రమలో అగ్రహీరోలతో నటించి లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగింది. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది. అరుంధతీ, రుద్రమదేవి, భాగమతి వంటి పవర్ఫుల్ పాత్రల్లో ఒదిగిపోయి.. తనకు తానే సాటి అని అనిపించుకుంది. మరోవైపు గ్లామర్‌తో కుర్రకారును కట్టిపడేసింది. సైజ్ జీరో మూవీ కోసం రిస్క్ తీసుకుని మరీ బరువు పెరిగి.. సినిమాలపై తన నిబద్ధతను నిరూపించుకుంది. తెలుగులో పాటు దక్షిణాది భాషల చిత్రాల్లోనూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి అనుష్క శెట్టి తెలుగు తెరకు దొరికిన అరుదైన నటి అనడంలో అతిశయోక్తి లేదు. గురువారం (నవంబర్ 7) ఈ లేడీ సూపర్ స్టార్ పుట్టిన రోజు. అనుష్క శెట్టి 43వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
స్వీటీ టు అనుష్క..
అనుష్క శెట్టి కర్ణాటకలోని మంగళూరులో 1981 నవంబర్ 7న జన్మించింది. నిజానికి అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. సినిమాల్లో ఆ పేరు అంతగా బాగోదని దర్శకుడు పూరీ జగన్నాథ్ అనుష్కగా మార్చారు.
శునకాలంటే ఇష్టం..
బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్లో డిగ్రీ పట్టా అందుకున్న అనుష్క.. సినిమాలకు రాకముందు యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసింది. అనుష్క శెట్టి జంతు ప్రేమికురాలు. ఇంట్లో ఎక్కువగా శునకాలను పెంచుకుంటుంది. వాటితో ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
'ప్రభాస్ కోసం అన్నీ వదిలేస్తా..'
'ప్రభాస్‌తో ఫ్రెండ్షిప్, సినిమాలు రెండిండ్లో ఒకటి కావాలంటే ఏది వదిలేస్తావు' అని క్యాష్ షో సందర్భంగా అనుష్కను ప్రశ్నించింది యాంకర్ సుమ. ఆ సమయంలో రెండో ఆలోచన లేకుండా ప్రభాస్‌తో స్నేహం కోసం సినిమాలను వదులుకుంటానని స్పష్టం చేసింది. సినిమాల్లోకి రాకుంటే యోగా టీచర్‌గానే స్థిరపడిపోయేదట. కానీ పరిశ్రమలో ఆమె అగ్రహీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది.
'కాబోయేవాడు పొట్టిగా ఉన్నా.. పెళ్లి చేసుకుంటా'
అనుష్క అనగానే.. అందంతోపాటు ఆమె ఎత్తు కూడా గుర్తొస్తుంటుంది. మరి ఎత్తు వల్ల సమస్యలు వచ్చాయా? అని ఆమెను అడిగితే.. 'సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అది సమస్య అవుతుందేమోనని భయపడ్డా. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. కాబట్టి ఇబ్బంది లేదు. నాకంటే కాస్త ఎత్తు తక్కువ ఉన్న హీరోలతో చేసిన సినిమాలు కూడా హిట్ అయ్యాయి' అన్నారామె. అంతేకాదు భవిష్యత్తులో తనను చేసుకోబోయేవాడు తనకంటే పొట్టిగా ఉన్నా ఫర్వాలేదని చెప్పింది. 'అందం అనేది బోనస్.. మొదటి ప్రాధాన్యం మాత్రం కాదు..' అని చెప్పి ఆదర్శంగా నిలిచింది.
సినిమా పట్ల నిబద్ధత..
అనుష్క చిత్రాల్లో సైజ్ జీరో చాలా ప్రత్యేకం. అందులోని పాత్రకు న్యాయం చేయాలని స్వీటీ ఏకంగా 20 కిలోల బరువు పెరిగింది. టాలీవుడ్ అగ్ర కథానాయకులు అనుష్కకు మంచి స్నేహితులు. వారితో కలిసి ఆమె నటించిన బాహుబలి సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించింది.
'కోటబొమ్మాళి పీఎస్' టీజర్ ఔట్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో శ్రీకాంత్ కమ్‌బ్యాక్ అదుర్స్!
స్టార్ క్రికెటర్‌తో డేటింగ్- ఎట్టకేలకు స్పందించిన సారా, ఏమందో తెలుసా?