ETV Bharat / entertainment

పోలాండ్​లో 'ఈగల్'​ మూవీ షూటింగ్.. అనుపమ, కావ్యతో రవితేజ రొమాన్స్​!​ - అనుపమ పరమేశ్వరన్​

టాలీవుడ్​ హీరో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'ఈగల్'​. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్​ పోలాండ్​లో శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో యువ హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్​, కావ్య నటించనున్నారని తెలిసింది.

anupama-parameshwaran-and-kavya-thappar-under-consideration-for-raviteja-eagle-movie

author img

By

Published : Oct 30, 2022, 10:14 PM IST

Raviteja Eagle Movie Heriones: మాస్‌ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆయన నటించిన 'ఖిలాడీ', 'రామారావు ఆన్‌ డ్యూటీ' చిత్రాలు ఫ్లాప్ అయినా.. రవితేజ మాత్రం సినిమాల వేగాన్ని తగ్గించడం లేదు. ఒక వైపు సినిమాలు షూటింగ్‌ దశలో ఉండగానే, మరో వైపు కొత్త మూవీలను సెట్స్‌ పైకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో 'ఈగల్‌' ఒకటి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కార్తీక్‌ ఘట్టమనేని ఈ చిత్రంతో మెగా ఫోన్‌ పట్టనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పొలాండ్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ సినిమాలో ఇద్దరు యంగ్‌ హీరోయిన్‌లు నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కార్తికేయ-2తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్‌ ఒకరు కాగా, మరొకరు 'ఏక్‌ మినీ కథ'తో బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిన కావ్యా తప్పర్‌. ఈ ఇద్దరు హీరోయిన్‌లు రవితేజకు జోడీగా ఈ చిత్రంలో నటించనున్నారని తెలిసింది. ప్రతీకార నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్‌.. హాలీవుడ్‌ చిత్రం జాన్‌విక్‌ ఆధారంగా రూపొందిస్తున్నట్లు టాక్. ఈ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

ఇవీ చదవండి:

ఆఫ్రికాలో రామ్​చరణ్​ వెకేషన్.. వంట చేస్తూ ఎంజాయ్​.. వీడియో చూశారా?

నెట్టింట వైరల్​గా మారిన బన్నీ ఫొటో.. 'పుష్ప-2' షూటింగ్​ స్టార్ట్​ అయిందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.