ETV Bharat / entertainment

అనుదీప్​తో వెంకీ కొత్త చిత్రం, కలెక్షన్లలో దూసుకెళ్తున్న సీతారామం - సుధీర్ బాబు సినిమా 16వ సినిమా టైటిల్

ANUDEEP VENKATESH MOVIE విక్టరీ వెంకటేశ్​తో జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కేవీ ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు సమాచారం. మరోవైపు, ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన సీతారామం కలెక్షన్లు కురిపిస్తోంది. ఇప్పటివరకు రూ.75 కోట్ల వచ్చినట్లు సినీ బృందం వెల్లడించింది. హీరో సుధీర్ బాబు కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్​లుక్​పై కొత్త అప్డేట్ మీకోసం.

anudeep venkatesh movie
అనుదీప్ వెంకటేశ్ మూవీ
author img

By

Published : Aug 27, 2022, 6:17 PM IST

ANUDEEP VENKATESH MOVIE 'జాతిరత్నాలు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు అనుదీప్ కేవీ. ఈ దర్శకుడు ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్​తో ఓ సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే వెంకటేశ్​కు ఇంకా కథ వినిపించలేదని.. త్వరలో వినిపిస్తానని అనుదీప్ కేవీ అన్నట్లు సమాచారం. వెంకీ ఈ కథకు ఓకే చెబితే త్వరలోనే క్రేజీ కామెడీ ప్రాజెక్ట్​ తెరకెక్కనుంది.

అనుదీప్ తాజాగా తెరకెక్కించిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా సెప్టెంబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ రెడ్డి, సంచితా బసు జోడిగా నటించారు. అనుదీప్ దర్శకత్వంలో తమిళ కథానాయకుడు శివకార్తికేయన్​ కాంబోలో తెరకెక్కిన 'ప్రిన్స్' మరికొన్ని నెలల్లో విడుదల కానుంది. 'ఎఫ్‌3'తో నవ్వించిన వెంకటేష్‌.. తన కొత్త సినిమాని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. కొంతకాలంగా కథల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన, ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌తో కలిసి హిందీ చిత్రం 'కభీ ఈద్‌ కభీ దివాలి' చేస్తున్నారు. మరి సోలోగా వెంకీ చేయనున్న కొత్త చిత్రం ఏమిటనేది మాత్రం ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.

sita ramam collection: ఇటీవల విడుదలైన ప్రేమకథా చిత్రం 'సీతారామం' భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో.. దుల్కర్​ సల్మాన్​, మృణాల్​ ఠాకుర్​, రష్మిక మంధాన ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సీతారామం సాలిడ్​ హిట్​గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.75 కోట్లకుపైగా గ్రాస్​ సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తెలిపింది.

sitaram movie 75 crores collection
.

sudheer babu new movie:
విభిన్న పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సుధీర్​బాబు. ఆయన కొత్త దర్శకుడు మహేశ్ సురపునేని దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్​లుక్​ను ఆగస్టు 28న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

sitaram movie 75 crores collection
.

ఇవీ చదవండి: అయ్యో పాపం శ్రద్ధా, అనసూయకు సపోర్ట్​ చేసినందుకు

పులితో ఎన్టీఆర్ ఫైట్​ సీన్​ మేకింగ్ వీడియో విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.