ETV Bharat / entertainment

ఓవర్​నైట్​ స్టార్ అయిపోయిన 'జమాల్ కుడు' బ్యూటీ - ఆ సినిమాలోనూ ఈమె పాపులరే! - యానిమల్ జమాల్ కుడు సాంగ్

Animal Jamal Kudu Actress : యానిమాల్​ మూవీ ఎటువంటి మాసివ్​ సక్సెస్​ అందుకుందో అందులోని సాంగ్స్​ కూడా అంతే హిట్​ టాక్​ సాధించాయి. ప్రతి ఒక్క సాంగ్​ను మ్యాజిక్ లవర్స్​ ఎంతగానో ఆస్వాదించారు. ముఖ్యంగా యానిమల్ విలన్​ అబ్రార్ ఎంట్రీ సాంగ్​ 'జమాల్​ కుడు'కు మ్యూజిక్​ లవర్స్​కు విశేష స్పందన లభించింది. అయితే ఈ వీడియో సాంగ్​లో ఉన్న ఓ బ్యూటీపై అందరి దృష్టి పడింది. ఇంతకీ ఆమె ఎవరంటే ?

Animal Jamal Kudu Actress
Animal Jamal Kudu Actress
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 7:15 PM IST

Animal Jamal Kudu Actress : రణ్​బీర్​ కపూర్​ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'యానిమల్​'. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్​ వద్ద మంచి టాక్ అందుకుని సెన్సేషన్ క్రియేట్​ చేస్తోంది. అయితే ఈ సినిమాతో పలువురు స్టార్స్​కు మంచి గుర్తింపు లభించింది. బాలీవుడ్ నటుడు బాబి దేఓల్​, తృప్తి డిమ్రి లాంటి స్టార్స్​కు మరింత ఫ్యాన్​ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే తాజాగా మరో నటిపై నెటిజన్లు దృష్టి పడింది. 'జమాల్​ కుడు' వీడియో సాంగ్​లో పాట పడుతున్న గ్రూప్​లో కనిపించి ఈమె స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది. ఆ అమ్మాయి పాట పాడుతున్న తీరు, హావభావలు, లుక్స్ ఇలా అన్నింటితో అభిమానులను ఆకట్టుకుంది. దీంతో ఈ అమ్మడి కోసం నెట్టింట తెగ వెతికేస్తున్నారు.

అయితే ఆ అమ్మాయి పేరు 'తన్నాజ్ దవూరి' అని తెలిసింది. ఇరాన్​కి చెందిన ఈ యువతి తొలుత మోడలింగ్ చేసేది. ఆ తర్వాత బ్యాక్​ డ్యాన్సర్​గా పలు స్టేజి షోల్లో బాలీవుడ్ సాంగ్స్​కు పర్ఫామెన్స్ ఇచ్చింది. నోరా ఫతేహి, వరుణ్ ధావన్, జాన్ అబ్రహం, సన్నీ లియోన్ ఇలా అందరితో కలిసి స్టెప్పులేసింది. అయితే ఆ అమ్మడిని అంతగా గుర్తుపట్టలేదు. ఈ సాంగ్​లో స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచిన తర్వాత ఇప్పుడు ఫ్యాన్స్​ ఆమె పాత వీడియోలను చూస్తూ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.

మరోవైపు అప్పటి వరకు వేలల్లో ఉన్న తన్నాజ్ సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. కేవలం రెండు వారాల్లోనే ఈమె ఫాలోవర్స్ సంఖ్య 2.6 లక్షలకు చేరింది. ఇప్పటికే ఈ చిన్నది ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, ఈ సాంగ్​తో ఫ్యాన్స్​ను ఫిదా చేసి నేషనల్ క్రష్​ లిస్ట్​లోకి చేరిపోయింది.

ఇక ఈ పాట 1950స్​లో విడుదలైన ఓ ఇరానియన్ పాట నుంచి ఇన్​స్పిరేషన్​ తీసుకుని మ్యూజిక్​ డైరెక్టర్ హర్షవర్ధన్ రీ క్రియేట్​ చేశారు. అందులోని పదాలకు 'ఓ నా ప్రేమ.. ప్రియమైన.. నా మధురమైన ప్రేమ' అని అర్ధమట. ట్యూన్​తో పాటు సాంగ్​ కూడా సూపర్​గా ఉండటం వల్ల ఫ్యాన్స్​ దీనికి ఫుల్​ కనెక్ట్​ అయిపోయారు. నెట్టింట రీల్స్​ చేస్తూ సందడి చేస్తున్నారు.

రష్మిక 'క్రష్​ క్లబ్'​లో చేరిన ఆలియా భట్- 'యానిమల్' హీరోయిన్ రియాక్షన్ ఏంటో తెలుసా?

ఇన్​స్టాలో 39 లక్షల మంది ఫ్యాన్స్​! యానిమల్​లో 'తృప్తి' అందుకే యాక్ట్ చేసిందట!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.