బుల్లితెర యాంకర్‌గా లాస్యది ఓ ప్రత్యేకమైన జర్నీ. 'సంథింగ్ స్పెషల్' రూపంలో యాంకరింగ్ చేయడంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అయితే ఆ తర్వాత క్రమంగా బుల్లితెరకు దూరమైన లాస్య తిరిగి కొంతకాలం నుంచి సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటోంది. యూట్యూబ్ ఛానల్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోలతో నెట్టింట సందడి చేస్తుంది. అయితే తాజాగా ఈ అమ్మడు హాస్పిటల్ పాలైంది.
ఈ విషయాన్ని స్వయంగా లాస్య భర్త మంజునాథ్ తన ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చారు. గెట్ వెల్ సూన్ అంటూ ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. దీంతో యాంకర్ లాస్యకు ఏమైందంటూ ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. లాస్య హాస్పిటల్‌లో ఎందుకు చేరిందన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు ఆమె త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'బ్రహ్మస్త్రం' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. మేకర్స్ అన్ని కోట్లు నష్టపోయారా?