ETV Bharat / entertainment

వైరల్​గా అనసూయ ట్వీట్​.. విజయ్​ను ఉద్దేశించే పెట్టిందా?.. ఫ్యాన్స్​ ఫుల్​ ఫైర్​! - విజయ్​ దేవరకొండపై అనసూయ కామెంట్స్​

యాంకర్ అనసూయ పెట్టిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె హీరో విజయ్​ దేవరకొండను ఉద్దేశించి ఆ ట్వీట్ పెట్టిందని నెటిజన్లు అనుకుంటున్నారు. ఆమెపై ఫుల్ ఫైర్ అవుతున్నారు.

Anasuya vijay devarkonda
వైరల్​గా అనసూయ ట్వీట్​.. విజయ్​ను ఉద్దేశించే పెట్టిందా?.. ఫ్యాన్స్​ ఫుల్​ ఫైర్​!
author img

By

Published : May 6, 2023, 11:14 AM IST

Updated : May 6, 2023, 12:07 PM IST

సినీ నటి, యాంకర్​ అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేదని చెప్పాలి. ఎందుకంటే సుదీర్ఘ కాలంగా అటు బుల్లితెరపై.. కొంతకాలంగా వెండితెరపై సందడి చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరుసగా అవకాశాలను అందుకుంటూ ఏదో ఒక పాత్రలో తెరపై కనిపిస్తోంది. అలానే సోషల్‌మీడియా వేదికగా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ కాంట్రవర్సీగా మారుతుంటుంది. తన ట్వీట్లతో ఎక్కువగా ట్రోల్స్​కు గురౌతుంటుంది. ఇంకా చెప్పాలంటే సినిమాలు, షోస్​ కన్నా సోషల్​మీడియాలోనే ఎక్కువ హైలైట్​ అవుతోంది. ఆ మధ్యలో తనను ఆంటీ అన్నారని ఎంతలా రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ ఆమె చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్‌గా మారింది. ఓ స్టార్ హీరోను ఉద్దేశించి ఆమె పెట్టినట్టు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

"ఇప్పుడే ఒకటి చూశాను. 'ది' అనే పదం పెట్టుకుంటారా? బాబోయ్‌. ఇదేం పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం" అంటూ అనసూయ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్​ సెన్షేషన్​ స్టార్ విజయ్​ దేవరకొండ ప్రస్తుతం 'ఖుషి' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్​పై 'ది' విజయ్​ దేవరకొండ అని రాసి ఉంటుంది. దీంతో ఆమె విజయ్​ను ఉద్దేశిస్తూ ఈ ట్వీట్​ పెట్టిందని నెటిజన్లు అంటున్నారు. దీంతో సదరు హీరో అభిమానులు అనసూయపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంటీ పేరుతో ట్రెండ్​ చేస్తూ.. ట్రోల్స్​ చేస్తూ ఓ ఆటాడేసుకుంటున్నారు. ఆ హీరో విషయంలో అనసూయ ఎందుకింత కోపంగా ఉందంటూ మరికొంతమంది నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇంకొంతమంది 'ఖాళీగా ఉన్న సమయంలో ఇలాంటివి పెట్టి రెచ్చగొడుతుంటుంది', 'ప్రతిసారి అటెన్షన్ కోసం ఇలా చేస్తుంద'ని ట్వీట్ చేస్తున్నారు. ఇకపోతే గతంలో కూడా ఆమె దేవరకొండను ఉద్దేశిస్తూ ఏదో ఒక కామెంట్​తో సోషల్​మీడియాలో చాలా సార్లు ట్రోల్స్​కు గురైంది. అయినా మళ్లీ అలానే పరోక్షంగా ట్వీట్లు చేస్తూ హాట్​టాపిక్​గా మారుతోంది.

బంగారుకొండలు.. థ్యాంక్యూ.. అయితే తనపై నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తోన్న ఆ హీరో అభిమానులను ఉద్దేశిస్తూ మరో ట్వీట్‌ కూడా చేసింది అనసూయ. "భలే రియాక్ట్‌ అవుతున్నారుగా. బంగారుకొండలంత. ఎక్కడో అక్కడ నేను చెప్పింది నిజం అనేది నిరూపిస్తూనే ఉన్నందుకు థ్యాంక్యూ" అంటూ తనపై విమర్శలు చేస్తున్న వారికి ఆమె కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

Anasuya vijay devarkonda
వైరల్​గా అనసూయ ట్వీట్​

ఇదీ చూడండి: రింగుల హెయిర్​ స్టైల్​.. టాలీవుడ్​లో ఇప్పుడిదే హీరోస్​ ట్రెండ్​

Last Updated : May 6, 2023, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.