ETV Bharat / entertainment

యాంకర్​గా అనసూయ చెల్లి.. ఆ షోతో ఎంట్రీ!

author img

By

Published : Oct 19, 2022, 4:51 PM IST

యాంకర్, నటి అనసూయ చెల్లి వైష్ణవి.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిసింది. ఆ సంగతులు..

Anchor Anasuya sister as anchor
యాంకర్​గా యాంకర్ అనసూయ చెల్లి

ఏ రంగంలో అయినా ఒకరు సక్సెస్ అయితే ఆ రంగంలోకి తమ కుటుంబ సభ్యులను తీసుకురావాలని భావిస్తారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో చాలా వరకు ఇదే కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది స్టార్స్​ తమ వాళ్లను చిత్రసీమకు పరిచయం చేశారు. అయితే తాజాగా ఈ జాబితాలోకి స్టార్ యాంకర్ అనసూయ సోదరి కూడా చేరనున్నట్లు తెలుస్తోంది.

అనసూయ భరద్వాజ్.. బుల్లితెర స్టార్ యాంకర్​గా, వెండితెర నటిగా తనదైన స్ట్లైల్​లో అభిమానులను అలరిస్తున్నారు. విలక్షణమైన పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడామె తన ఇద్దరు చెల్లెల్లో ఒకరైన వైష్ణవిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. అందంలోనూ, చలాకీతనంలోనూ అనసూయని పోలి ఉండే వైష్ణవి.. అక్క బాటలోనే రాణించాలని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే వైష్ణవికి ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్​లో ప్రసారం కానున్న ఒక షో ద్వారా యాంకర్​గా ఎంట్రీ ఇచ్చే ఆఫర్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది కాలం వేచి ఉండాల్సిందే.

Anchor Anasuya sister as anchor
యాంకర్​గా అనసూయ చెల్లి

ఇదీ చూడండి: బాలకృష్ణ బాలీవుడ్ ఎంట్రీ.. ఆ డైరెక్టర్ సినిమాతోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.