బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ మంగళవారం తన 80వ పుట్టినరోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే బిగ్‌బీ బర్త్‌డే సందర్భంగా ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగ కరోడ్ పతి' షోలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అమితాబ్‌ను సర్ప్రైజ్ చేసేందుకు తల్లితో కలిసి ఆయన తనయుడు, హీరో అభిషేక్ బచ్చన్ షోకు సడెన్ ఎంట్రీ ఇచ్చారు.
షో జరుగుతుండగా ఒక్కసారిగా సైరన్ మోగడం.. అదేంటి షో అయిపోయిందా? అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్న తరుణంలో అభిషేక్ సడెన్ ఎంట్రీతో బిగ్‌బీని సర్ప్రైజ్ చేశారు. తనయుడి రాకతో అమితాబ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. అనంతరం తండ్రిని హాట్ సీట్లో కూర్చోబెట్టి, హోస్ట్ సీట్లో తాను కూర్చోని బిగ్‌బీతో ముచ్చటించారు అభిషేక్. ఈ సందర్భంగా బిగ్‌బీ.. అభిషేక్‌కు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అయితే ఇందుకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించిన వీడియోను అభిషేక్ సోషల్‌మీడియాలో షేర్ చేశారు. 'దీని వెనుక చాలా ప్రణాళిక, ఎన్నో రిహార్సల్, హార్డ్ వర్క్ ఉంది. చాలా సీక్రెట్‌గా చేశాం. ఇది సరిగ్గా చేయడానికి ఎంతో కష్టపడ్డాం. నాన్న 80వ పుట్టిన రోజును ఆయన ఎంతో ఇష్టపడే వర్క్ ప్లేస్‌లో(కేబీసీ షో) జరపడం సంతోషంగా ఉంది. ఈ షోను చాలా ప్రత్యేకంగా చేసేందుకు నాకు సహాయం చేసిన సోనీ టీవీ, కౌన్ బనేగా కరోడ్‌పతి టీమ్‌కు నా కృతజ్ఞతలు" అంటూ అభిషేక్ రాసుకొచ్చారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: రామ్‌చరణ్ చెప్తేనే ఆ పని చేశా.. లేదంటే: చిరంజీవి