ETV Bharat / entertainment

కాస్ట్లీ విల్లాను కొనుగోలు చేసిన పాప్​ సింగర్స్.. ధర​ రూ.1650 కోట్లు! - beyonce and jay z california house

అమెరికన్ పాప్​​ స్టార్‌ సింగర్స్‌ బియాన్స్‌, ఆమె భర్త ర్యాపర్​ జే-జెడ్‌ ఇటీవలే కాలిఫోర్నియాలోని ఓ ఇంటిని కొనుగోలు చేశారు. పసిఫిస్​ మహా సముద్ర అందాలను వీక్షించేలా నిర్మించిన ఈ విలాసవంతమైన భవనం విలువ తెలిస్తే కచ్చితంగా షాక్​ అవ్వాల్సిందే. ఇంతకీ ఈ విల్లా ఎంతంటే ?

beyonce and jay-z
beyonce and jay-z
author img

By

Published : May 21, 2023, 11:02 AM IST

Beyonce new home : అమెరికన్ పాప్​​ స్టార్‌ సింగర్స్‌ బియాన్స్‌, ఆమె భర్త ర్యాపర్​ జే-జెడ్‌.. ఓ ఇంటివారయ్యారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ జంట కాలిఫోర్నియాలో కొత్తగా ఓ ఇంటిని కొనుగోలు చేశారట. విలాసవంతమైన ఆ భవనం విలువ అక్షరాలా సుమారు 200 మిలియన్ల డాలర్లని సమాచారం. ఈ మొత్తం సొమ్మును భారతీయ కరెన్సీలోకి మార్చితే.. ఆ భవంతి విలువ దాదాపు రూ.1,656 కోట్లు పలికింది. కాగా ఈ దంపతులు కొనుగోలు చేసిన ఇల్లు కాలిఫోర్నియాలోని మాలిబు ప్రాంతంలో ఉంది. అంతే కాకుండా ఆ రాష్ట్రంలో కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన ఆస్తిలో ఇది ఒకటి కావడం గమనార్హం. జపాన్​కు చెందిన టడావో ఆండో అనే ఆర్కిటెక్ట్‌ డిజైన్ చేసిన ఈ భవంతిలో సకల సౌకర్యలు ఉన్నాయి.

Beyonce california mansion
బియాన్స్​ కాలీఫోర్నియా విల్లా

Beyonce california mansion : ఇక ఈ భవంతిలో నుంచి అదే ప్రాంతంలో ఉన్న పసిఫిక్ మహా సముద్ర బీచ్‌ అందాలను కూడా వీక్షించవచ్చు. అయితే 2003 లో విలియం బెల్ అనే వ్యక్తి 14.5 మిలియన్ల డాలర్లను వెచ్చించి మరీ ఈ ఇల్లును కొనుగోలు చేశారు. తర్వాత టడావోకు ఇచ్చి దీన్ని మరమ్మత్తులు చేసి.. నూతన బిల్డింగ్​గా డిజైన్ చేయించారు. ఎల్‌ ఆకారంలో ఉన్న ఈ 30వేల చదరపు విస్తీర్ణం గల ఈ భవంతి.. బియాన్స్​ దంపతులు కొనుగోలు చేసే సమయానికి దాని విలువ 200 మిలియన్ల డాలర్లు పలికింది. అంతకు ముందు మాలిబు ప్రాంతంలో 2021లో వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ అండ్రీస్సెన్‌ 177 మిలియన్ల డాలర్లతో ఇదే ఇంటిని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ రికార్డును బియాన్స్‌ జంట బ్రేక్ చేసింది. ఇక 2017లో వీరు లాస్‌ఏంజెలెస్‌లో 88 మిలియన్ల డాలర్లు విలువైన ఓ ఖరీదైన బంగ్లాను సైతం కొనుగోలు చేశారు. ఆ విల్లాలో మీడియా రూమ్‌, బుల్లెట్‌ ప్రూఫ్ విండోస్‌, టెర్రస్‌లో అదనంగా 10 వేల చదరపు అడుగుల అవుట్‌డోర్‌ లివింగ్ స్పేస్‌ సైతం ఉంది. ప్రస్తుతం ఈ ఇంటి విలువ సుమారు 135 మిలియన్ల డాలర్ల వరకు ఉంటుందని సమాచారం.

Beyonce california mansion
బియాన్స్​ కాలీఫోర్నియా విల్లా

Beyonce grammy : ఇక బియాన్స్​ కెరీర్​ విషయానికి వస్తే.. రెండు దశాబ్దాలకు పైగా తన సుదీర్ఘ జర్నీలో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు, గుర్తింపులు సొంతం చేసుకున్న ఈమె.. సంగీత రంగంలోనే అత్యున్నతంగా భావించే 'గ్రామీ' పురస్కారాన్ని సైతం అందుకుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు 79 సార్లు ఈ అవార్డుకు నామినేట్‌ అయిన ఆమెకు ఇటీవలే తన 32వ గ్రామీ పురస్కారాన్ని ముద్దాడింది. 'RENAISSANCE' అనే ఆల్బమ్‌కి గానూ 'ఉత్తమ డ్యాన్స్‌/ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌' కేటగిరీలో ఈ అవార్డు అందుకుంది. దీంతో ఎక్కువసార్లు నామినేట్‌ అవడమే కాకుండా ఎక్కువ గ్రామీలు అందుకున్న సింగర్‌గా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.