Allarinaresh Itlu Maredumilli Prajanikam movie: ఒకప్పుడు వరుస కామెడీ చిత్రాలతో నటించి తనదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు నటుడు అల్లరి నరేశ్. అలానే అవకాశం దొరికినప్పుడల్లా విభిన్నమైన పాత్రలు చేస్తూ తనలోని కొత్త కోణాన్ని చూపించి సినీప్రియులను ఆకట్టుకున్నారు. అయితే ఆయన 'నాంది'తో రూటు మార్చారు. ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచేందుకు డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఏఆర్ రాజమోహన్ దర్శకత్వంలో తన 59వ చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చేస్తున్నారు. ఆనంది కథానాయిక.
తాజాగా ఈ సినిమా ప్రీటీజర్ను రిలీజ్ చేశారు. ఇందులో.. ఈ చిత్రం కోసం తమ చిత్రబృందం ఎంతలా కష్టపడిండో, షూటింగ్ కోసం ఎలాంటి రిస్క్ చేసిందో చూపించారు. అల్లరినరేశ్ కూడా ఎంత కష్టపడ్డారో చూపించారు. దట్టమైన అడవులు, ఎత్తైన కొండ ప్రాంతాల్లో 55 రోజుల పాటు షూటింగ్ జరిపినట్లు తెలిపిన మూవీటీమ్.. ఎవరూ చేయని 22 లొకేషన్స్‌తో చిత్రీకరణ జరిపినట్లు చూపించింది. ప్రతి లొకేషన్‌కు చేరుకోవడానికి కనీసం నాలుగు గంటలు పట్టేదని, 250 మంది పనిచేశారని చెప్పుకొచ్చింది. జూన్ 30న టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ చిత్రం ఆదివాసీల ఇతివృత్తంతో సాగే చిత్రం. కొంతకాలం క్రితం చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్స్... అందరీ దృష్టిని ఆకర్షించింది. సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ఈ మూవీలో అల్లరి నరేశ్ ఎన్నికల విధులపై ఓ ఆదివాసి గ్రామానికి వెళ్లే స్కూల్ టీచర్‌గా కనిపించనున్నారు. దీనిని జీ స్టూడియోస్, హర్ష మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడు. ఈ మూవీ షూటింగ్ పూర్తికాగానే.. నాంది సినిమాతో తనకు సూపర్ సక్సెస్‌ను అందించిన దర్శకుడు విజయ్ కనకమేడలతో తన 60వ చిత్రం చేయనున్నారు.
ఇదీ చూడండి: ఓటీటీ రిలీజ్‌పై నిర్మాత బన్నీవాసు షాకింగ్ కామెంట్స్